Mustard Crop: రైతులకు లాభాలను పండిస్తున్న ఆవాల పంట.. ప్రభుత్వం విత్తనాల కొరత లేకుండా చూడాలంటున్న అన్నదాత

|

Jun 24, 2021 | 5:07 PM

Mustard Crop Farming: ఆవాలు ధరలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ఈసారి రైతులకు ఆవాలు మంచి లాభాన్నితెచ్చిపెట్టాయి. ఆవాలు క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ .2500 కంటే..

Mustard Crop:  రైతులకు లాభాలను పండిస్తున్న ఆవాల పంట.. ప్రభుత్వం విత్తనాల కొరత లేకుండా చూడాలంటున్న అన్నదాత
Mustard Crop
Follow us on

Mustard Crop Farming: ఆవాలు ధరలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ఈసారి రైతులకు ఆవాలు మంచి లాభాన్నితెచ్చిపెట్టాయి. ఆవాలు క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ .2500 కంటే  ఎక్కువగా ఉంది. ఈ లాభాన్ని రైతులు బాగా పరిశీలిస్తున్నారు. దీంతో ఈసారి దేశంలో రికార్డు స్థాయిలో ఆవాలు ఉత్పత్తి జరిగింది. అయినప్పటికీ, ధరలో తగ్గింపు లేదు. ఈ నూనెగింజల పంట పండించే విస్తీర్ణం పెరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే పంట కోసం వేసే ఆవ విత్తనాల కొరత ఏర్పడకూడదని రైతులు కోరుతున్నారు.

ఆవాల పంట కోసం విత్తనాలను అక్టోబర్-నవంబర్ నెలలో విత్తుతారు . విత్తనాల కొరత లేకుండా రైతులు ఆవాల పంట వేసుకునే విధంగా ప్రభుత్వం చెర్యలు తీసుకోవాలి. ముందుగానే రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఆవాల విత్తనాలను రెండు, మూడు నెలలకు ముందుగానే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఈ సంవత్సరం రైతులకు ఆవ పంట ద్వారా మంచి లాభం వచ్చింది. దీంతో ఆవాలు, సోయాబీన్ ధాన్యం వంటి వాటికి విత్తనాల కొరత లేనట్లయితే.. నెక్స్ట్ పంట కూడా దిగుబడి గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే రైతులు పండించిన ఆవాలను సహకార సంఘాలు, నాఫెడ్ వంటి సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. దేశంలో 3.5 నుంచి నాలుగు లక్షల బస్తాల ఆవాలను రోజువారీ వినియోగిస్తారని మార్కెట్ వర్గాలు తెలిపాయి, అయితే ప్రస్తుతం మార్కెట్లో రెండు నుంచి 2.5 లక్షల బస్తాలు మాత్రమే లభ్యమవుతున్నాయని చెప్పారు.

ఆవాల్లోని కల్తీని తనిఖీ చేయడానికి ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ క్రమం తప్పకుండా నమూనాలను సేకరిస్తోందని, ఈ కారణంగా వినియోగదారులు తినడానికి స్వచ్ఛమైన ఆవ నూనెను పొందుతున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. విదేశీ మార్కెట్లలో డిమాండ్ ఉన్నప్పటికీ, స్థానిక మార్కెట్ లో డిమాండ్ తక్కువగా ఉన్నందున నూనె గింజల ధరలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి.

భారత దేశం వ్యవసాయ దేశంగా ఉన్నప్పటికీ..  ఏటా 70,000 కోట్ల రూపాయల వంట నూనెను దిగుమతి చేసుకుంటోంది. రైతులు ఆవాలు, సోయాబీన్, వేరుశనగ, పొద్దుతిరుగుడు పండించినట్లయితే, దిగుమతుల కోసం ఖర్చు చేసే ఈ డబ్బు దేశ రైతుల బ్యాంకు ఖాతాకు జమ చేయబడుతుంది. తద్వారా రైతుతో పాటు.. దేశ ఆర్ధిక ప్రగతి బాగుంటుంది.

Also Read: ఇయర్ బడ్స్ ను లాంఛ్ చేసిన లావా .. ఒక రూపాయి మాత్రమే.. స్టాక్ ఉన్నంత వరకే ప్రత్యేక ఆఫర్..