అన్నం vs చపాతీ.. రాత్రివేళ ఏది తింటే మంచిది.. పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్ ఇదే..

ప్రస్తుత జీవనశైలిలో చాలామంది రాత్రి భోజనంలో అన్నం మానేసి చపాతీల వైపు మొగ్గుచూపుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పరిమిత మోతాదులో తీసుకునే చపాతీలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు మేలు చేస్తాయి. చపాతీలో ఉండే పీచు పదార్థం ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించి అతిగా తినకుండా సహాయపడుతుంది.

అన్నం vs చపాతీ.. రాత్రివేళ ఏది తింటే మంచిది.. పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్ ఇదే..
Rice Or Chapati

Updated on: May 13, 2026 | 7:41 PM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి ఆధునిక జీవనశైలిలో చాలామంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. రాత్రిపూట అన్నం మానేసి చపాతీలను తినడం ఒక ట్రెండ్‌గా మారింది. ఇది సరైనదేనా, లేక కొత్త ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్నం, చపాతీ రెండూ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. అయితే, కీలకమైన అంశం తీసుకునే పరిమాణం. అన్నం విషయంలో కూర తక్కువగా తీసుకుంటాం.. కానీ చపాతీకి ఎక్కువ కూర అవసరమవుతుంది. డయాబెటిస్ ఉన్నవారు రాత్రి భోజనంలో చపాతీ, అన్నం ఎంపిక విషయంలో తరచు గందరగోళానికి లోనవుతారు.

చపాతీలు సాధారణంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. పరిశోధనల ప్రకారం, చపాతీలు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా గుర్తించబడ్డాయి. బరువు తగ్గాలనుకునే వారికి చపాతీలు మంచి ఆహార ఎంపిక. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు రెండు మధ్యస్థ పరిమాణపు చపాతీలను తీసుకోవడం వల్ల వాటిలోని అధిక పీచు పదార్థం ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించి బరువు నిర్వహణకు సహాయపడుతుంది. ఈ పీచు పదార్థం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు నిపుణుల సలహా మేరకు చపాతీని తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ప్రయోజనకరమని సూచిస్తున్నారు.

చపాతీ కేవలం పీచు పదార్థాన్ని మాత్రమే కాకుండా అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్లు బి, ఇ తో పాటు కాల్షియం, జింక్, కాపర్, ఐరన్, అయోడిన్, మాంగనీస్, సిలికాన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. చపాతీలో ఉండే అధిక ఐరన్ స్థాయిలు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి, తద్వారా రక్తహీనత వంటి సమస్యలు రాకుండా నివారించవచ్చు. అలాగే, చపాతీలో ఉండే సెలీనియం క్యాన్సర్ కారకాలు శరీరంపై దాడి చేయకుండా రక్షిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

అయితే, చపాతీ ఆరోగ్యకరమైనది కదా అని ఎక్కువ నూనె లేదా నెయ్యితో తయారుచేసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు చేరతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చపాతీలను ఆరోగ్యకరంగా తయారు చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముడి గోధుమలను కొనుగోలు చేసి, స్వయంగా పిండి పట్టించుకుని దానితో చపాతీలు చేసుకుంటే మంచిది. కేవలం గోధుమ పిండి కాకుండా, రాగి, సోయాబీన్ లేదా ఇతర చిరుధాన్యాలతో చేసిన పిండిని కూడా గోధుమ పిండికి కలిపి చపాతీలు తయారు చేసుకోవచ్చు. బయట దొరికే మల్టీగ్రెయిన్ పిండిని ఉపయోగించడం కూడా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా, చపాతీలను పరిమిత పరిమాణంలో తీసుకున్నంతవరకు ఎటువంటి సమస్య ఉండదని, కానీ అతిగా తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు నొక్కి చెబుతున్నారు.

డైలీ అన్నం తినడం వల్ల..

అయితే.. రాత్రివేళ అన్నం కంటే చపాతీనే బెటర్ అని ఆహార నిపుణులు చెబుతున్నారు. రాత్రివేళ అన్నం తింటే.. శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల, అన్నంలోని కార్బోహైడ్రేట్లు కొవ్వుగా మారి బరువు పెరిగే అవకాశం ఉంది. బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది.. ఇది రాత్రిపూట రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది.. అంతేకాకుండా అన్నం తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అన్నం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రతిరోజూ రాత్రి అన్నం తినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరిగి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ వార్తా కథనం కేవలం అవగాహాన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us