Vepa Puvvu Pachadi: వేప పువ్వును ఉగాది పచ్చడికే వాడుతున్నారా?.. ఈ రోటి పచ్చడి రుచి చూస్తే అస్సలు వదలరు!

వేప పువ్వు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. కానీ, వేప పువ్వులో ఉన్న ఔషధ గుణాలు కేవలం ఆ ఒక్క రోజుకే పరిమితం కాకూడదు. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడే వారికి వేప పువ్వు ఒక దివ్యౌషధం. రొటీన్ రోటి పచ్చళ్లకు భిన్నంగా, అటు రుచిని, ఇటు ఆరోగ్యాన్ని ఇచ్చే వేప పువ్వు రోటి పచ్చడి ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. చేదును ఇష్టపడని వారు కూడా లొట్టలు వేసుకుంటూ తినేలా ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో, అందులో ఉన్న రహస్యాలేంటో చూద్దాం.

Vepa Puvvu Pachadi: వేప పువ్వును ఉగాది పచ్చడికే వాడుతున్నారా?.. ఈ రోటి పచ్చడి రుచి చూస్తే అస్సలు వదలరు!
Vepa Puvvu Pachadi Recipe

Updated on: Mar 02, 2026 | 9:15 PM

శరీరంలోని వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేయడంలో వేప పువ్వుకు సాటి లేదు. వేసవి కాలంలో లభించే ఈ అద్భుతమైన పువ్వుతో రోటి పచ్చడి చేసుకుంటే.. అన్నంలోకి అద్దిరిపోతుంది. చింతపండు పులుపు, ఎండుమిర్చి కారం, వేప పువ్వు చేదు.. అన్నీ కలిసి ఒక అద్భుతమైన రుచిని ఇస్తాయి. మరీ ముఖ్యంగా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయాలనుకునే వారికి ఇది ఒక ‘సూపర్ ఫుడ్’. మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ తయారీ విధానాన్ని ఇప్పుడే తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

వేప పువ్వు – 1 కప్పు

ధనియాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు – ఒక్కో టేబుల్ స్పూన్

ఎండుమిర్చి – 5, వెల్లుల్లి – 5 రెబ్బలు

చింతపండు – ఉసిరికాయంత (నానబెట్టినది)

తాలింపు గింజలు, కరివేపాకు, నూనె, ఉప్పు, పసుపు

తయారీ విధానం:

ముందుగా వేప పువ్వును శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. పచ్చడి ముద్దగా రాకుండా ఉండాలంటే తడి లేకపోవడం ముఖ్యం.

మసాలా వేయించడం

పాన్ లో నూనె వేసి ధనియాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చిని దోరగా వేయించాలి. ఆ తర్వాత వేప పువ్వును కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు 5 నిమిషాలు లో-ఫ్లేమ్ లో మగ్గించాలి. చివరగా వెల్లుల్లి, పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

రోటి మ్యాజిక్

ఈ మిశ్రమం చల్లారిన తర్వాత రోట్లో వేసి, నానబెట్టిన చింతపండు, తగినంత ఉప్పు కలిపి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోలు లేకపోతే మిక్సీలో ఒక్కసారి పల్స్ చేస్తే సరిపోతుంది. మరీ మెత్తగా కంటే బరకగా ఉంటేనే రుచి.

అదిరిపోయే తాలింపు

మరో పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చి శనగపప్పు, కరివేపాకుతో తాలింపు వేసి.. సిద్ధం చేసుకున్న పచ్చడిని అందులో వేసి రెండు నిమిషాలు మగ్గిస్తే ఘుమఘుమలాడే వేప పువ్వు పచ్చడి రెడీ!

Follow Us