Rainy season: వర్షంలో తడుస్తున్నారా.? వ్యాధుల బారిన పడొద్దంటే..

|

Jun 24, 2024 | 4:06 PM

వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే వర్షాలు కురువడం ప్రారంభమైంది. దీంతో ఆఫీసులకు వెళ్లే వారికి, స్కూళ్లకు వెళ్లే చిన్నారులు ఏదో ఒక సమయంలో వర్షంలో తడవడం ఖాయం. ఇలా వర్షంలో తడవగానే చాలా మంది జ్వరం, జలుబు, తుమ్ములు లాంటి సమస్యలు వేధిస్తుంటాయి. అయితే వర్షంలో తడవడం ద్వారా వచ్చే ఇలాంటి సమస్యలకు ఇంట్లోనే లభించే వస్తువుల...

Rainy season: వర్షంలో తడుస్తున్నారా.? వ్యాధుల బారిన పడొద్దంటే..
Health In Rain Season
Follow us on

వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే వర్షాలు కురువడం ప్రారంభమైంది. దీంతో ఆఫీసులకు వెళ్లే వారికి, స్కూళ్లకు వెళ్లే చిన్నారులు ఏదో ఒక సమయంలో వర్షంలో తడవడం ఖాయం. ఇలా వర్షంలో తడవగానే చాలా మంది జ్వరం, జలుబు, తుమ్ములు లాంటి సమస్యలు వేధిస్తుంటాయి. అయితే వర్షంలో తడవడం ద్వారా వచ్చే ఇలాంటి సమస్యలకు ఇంట్లోనే లభించే వస్తువుల ద్వారా సహజ సిద్ధంగా చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వర్షంలో తడవగానే తుమ్ములు, జలుబు మొదలైతే ఆవిరి బెస్ట్ రెమెడిగా చెప్పొచ్చు. వేడి నీటిలో పసుపు లేదా బామ్ వేసి ఆవిరి పీల్చుకోవడం ద్వారా ముక్కులో పేరుకుపోయిన శ్లేష్మం కరిగిపోతుంది. అలాగే యూకలిప్టస్ ఆయిల్‌ కూడా బాగా పనిచేస్తుంది. ఇలా చేస్తే సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.

* ఇక వర్షాకాలంలో చిన్నారులతో పాటు పెద్దలు కూడా కచ్చితంగా పాలలో పసుపు వేసుకొని తాగాలి. పసులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జలుబు, తుమ్ముల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్‌ పసుపు వేసుకొని రాత్రి పడుకునే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

* గొంతు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి అల్లం రసం, తేనె దివ్యౌషధంగా చెప్పొచ్చు. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు జలుబు, తుమ్ములను తగ్గిస్తాయి. అల్లం రసానికి సమానంగా తేనె కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, రోగనిరోధక శక్తి పెరగడంలో ఉపయోగపడుతుంది.

* వర్షంలో తడవగానే ముందుగా గొంతు నొప్పి సమస్య వస్తుంది. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం లభించాలంటే ఉప్పు నీటితో పుక్కిలించాలి. ఉప్పులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు గొంతు ఇన్ఫెక్షన్‌తో పోరాడుతుంది.

* తులసి, నల్ల మిరియాలు కూడా వర్షాకాలం వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియ్‌, యాంటీ వైరల్‌ గుణాలు బాగా పనిచేస్తాయి. ఒక కప్పు నీటిలో కొన్ని తులసి ఆకులు, మిరియాల పొడి వేసి బాగా మరిగించి తాగాలి. ఇలా చేస్తే తుమ్ములు, జలుబు సమస్య దరిచేరదు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..