Health: బెల్లం, శనగపప్పు కలిపి తింటే.. శరీరంలో జరిగే అద్భుత మార్పులివే..

|

Oct 04, 2024 | 8:38 PM

బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శనగలు బెల్లంను కలుపుకొని తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది దివ్యౌషధంగా చెప్పొచ్చు. ముఖ్యంగా పరగడుపున తీసుకుంటే లాభాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. రోగనిరోధక వ్యవస్థను...

Health: బెల్లం, శనగపప్పు కలిపి తింటే.. శరీరంలో జరిగే అద్భుత మార్పులివే..
Chana And Jaggery Mix
Follow us on

కొన్ని రకాల సహజ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో బెల్లం ఒకటి. బెల్లంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బెల్లంతో పాటు శనగలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అద్భుత మార్పులు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. శనగలు, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శనగలు బెల్లంను కలుపుకొని తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది దివ్యౌషధంగా చెప్పొచ్చు. ముఖ్యంగా పరగడుపున తీసుకుంటే లాభాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. రోగనిరోధక వ్యవస్థను బలపరడచంలో ఉపయోగపడుతుంది. దీంతో సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

తరచూ వ్యాధుల బారిన పడే వారు శనగలు బెల్లం కలుపుకొని తీనడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతమవుతుంది. ఎముకలను దృఢంగా మార్చడంలో కూడా బెల్లం,శనగలు దోహదపడాతయని నిపుణులు అంటున్నారు. బెల్లంలో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా బెల్లం, శనగలు ఉపయోగపడతాయి. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ముఖ్యంగా చిన్నారులకు ఇది అందించడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే.. ప్రతీ రోజూ ఉదయం బెల్లం, శనగల మిశ్రమాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గడంలో దోహదపడుతుంది. మలబద్ధకం నియంత్రణలో కూడా బెల్లం, శనగలు దోహదపడతాయి. కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా తోడ్పడుతుంది. వీటిలోని ఫైబర్‌ కంటెంట్‌ కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..