చాక్లెట్‌ను ఇష్టపడని వారు ఉండనరడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరూ చాక్లెట్ చూడగానే టెంప్ట్ అవుతారు. అయితే చాక్లెట్‌కు సంబంధించి ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. చాక్లెట్ తింటే ముఖంపై మొటిమలు వస్తాయని నమ్ముతారు. అయితే నిజంగానే చాక్లెట్‌లు ఎక్కువగా తింటే ముఖంపై మొటిమలు వస్తాయా.? చర్మ సంబంధిత సమస్యలకు చాక్లెట్లకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చాక్లెట్‌కు, మొటిమలకు మధ్య సంబంధం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 1960లో నిర్వహించిన పలు అధ్యయనాల్లో ఈ విషయాలు తేలాయి. సాధారణంగా కొవ్వు, నూనె, చక్కెర, పాల ఉత్పత్తులు అధికంగా ఉండే ఆహార పదార్థాల వల్ల ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. క్లీవ్‌ల్యాండ్ మెడికల్ సెంటర్ యూనివర్శిటీ హాస్పిటల్‌లోని చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ గ్రెగొరీ ఆర్. డెలోస్ట్ అధ్యయనంలో వెల్లడైంది.
అయితే థాయ్‌లాండ్‌లోని బ్యాంక్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ప్రవిత్ అశ్వనోడా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మొటిమలకు చాక్లెట్ మాత్రమే కారణం కాదని చెబుతున్నారు. మొటిమలకు అనేక రకాల కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఆహారం, జన్యువులు, పర్యావరణం ఇలా అనేక కారణాలు మొటిమలకు కారణవుతాయని అన్నారు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మొటిమలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే చాక్లెట్లకు, మొటిమలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాక్లెట్లలో చక్కెర అధికంగా ఉంటుంది గానీ అధిక కొవ్వులు ఉండవని అంటున్నారు. కొన్ని రకాల చాక్లెట్ల వల్ల మంచి కూడా జరుగుతుందని చెబుతున్నారు. చర్మంపై వాపును కలిగించే ఆక్సీకరణ ఒత్తిడిని డార్క్ చాక్లెట్లు తగ్గిస్తాయని కొన్ని సర్వేల్లో తేలింది. మొటిమలు తీవ్రతను తగ్గించుకునేందుకు కంటే వయసు కనపడకుండా ఉండేందుకు డార్క్ చాక్లెట్లు తినడం ఉత్తమని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..