పండుగల వేళ ఇంటిని శుభ్రం చేస్తున్నారా..? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ట్రై చేశారంటే..తక్కువ టైంలో మీ ఇల్లు మెరిసిపోతుంది!

ఇల్లు శుభ్రం చేయడం అనేది ఒక పెద్ద సవాలుతో కూడుకున్న పని. చాలామంది ఎటువైపు నుండి పని ప్రారంభించాలో తెలియక తోచిన గది నుండి లేదా నేరుగా ఊడ్చి తుడుచుకోవడం ద్వారా పని మొదలుపెడుతుంటారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలా చేయడం వల్ల సమయంతో పాటు శక్తి కూడా వృథా అవుతుంది. సరైన క్రమంలో, సరైన విధానంలో ఇల్లు శుభ్రం చేస్తే తక్కువ శ్రమతోనే ఇల్లు మెరిసిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

పండుగల వేళ ఇంటిని శుభ్రం చేస్తున్నారా..? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ట్రై చేశారంటే..తక్కువ టైంలో మీ ఇల్లు మెరిసిపోతుంది!
Expert House Cleaning Tips

Updated on: Aug 01, 2026 | 12:20 PM

ఇల్లు శుభ్రం చేసేటప్పుడు సరైన క్రమాన్ని పాటించకపోతే సమయం, శ్రమ రెండూ వృథా అవుతాయి. పరిశుభ్రత నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంటి శుభ్రతను ఎల్లప్పుడూ కిచెన్ నుండి ప్రారంభించాలి. అత్యంత క్లిష్టమైన వంటగదిని మొదట శుభ్రం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాక మిగిలిన పని సులువవుతుంది. ఆ తర్వాత బాత్‌రూమ్, లివింగ్ రూమ్, చివరగా బెడ్‌రూమ్‌ను శుభ్రం చేయాలి. ప్రతి గదిలోనూ పైనుంచి కిందకి పద్ధతిని పాటించాలి. అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం..

మొదట కిచెన్ నుంచే ప్రారంభించండి:

శుభ్రత ప్రక్రియను ఎల్లప్పుడూ వంటగది నుంచే ప్రారంభించాలి. ఇంట్లోనే అత్యంత ఎక్కువ నూనె కారక జిడ్డు, మరకలు, ఆహార వ్యర్థాలు ఉండేది ఇక్కడే. అత్యంత కష్టమైన కిచెన్ పనిని ముందే పూర్తి చేయడం వల్ల పెద్ద భార దించినట్లవుతుంది. ఫలితంగా మిగిలిన ఇల్లు శుభ్రం చేయడానికి ఉత్సాహం పెరుగుతుంది.

రెండవ ప్రాధాన్యత బాత్‌రూమ్‌కు:

కిచెన్ తర్వాత బాత్‌రూమ్‌ను శుభ్రం చేయాలి. పరిశుభ్రత, ఆరోగ్యం దృష్ట్యా ఇది చాలా ముఖ్యం. బాత్‌రూమ్ క్లీనింగ్ పూర్తయితే ఇంటికి సగం ఫ్రెష్‌నెస్‌ వచ్చినట్లే.

ఇవి కూడా చదవండి

లివింగ్ రూమ్:

ఇంటికి వచ్చే అతిథులు, కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం గడిపేది లివింగ్ రూమ్‌లోనే. ఇక్కడ చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను చక్కబెట్టడం, సోఫా కుషన్లు సరిచేయడం, టేబుళ్లు, టివి యూనిట్లపై ఉన్న ధూళిని తుడవటం చేయాలి.

చివరగా బెడ్‌రూమ్:

బెడ్‌రూమ్‌లో రాకపోకలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, దీనిని చివర్లో శుభ్రం చేసుకోవడం సౌకర్యవంతంగా ఉంటుంది. దుప్పట్లు మార్చడం, బెడ్‌ను సర్దడం, ఫర్నిచర్‌పై ధూళి తుడవటం వంటివి ఇక్కడ పూర్తి చేయాలి.

పాటించాల్సిన గోల్డెన్ రూల్:

ఏ గదిని శుభ్రం చేసినా ఎల్లప్పుడూ పై నుండి కిందకి అనే నియమాన్ని పాటించాలి. మొదట సీలింగ్ ఫ్యాన్లు, లైట్లు, షెల్ఫ్‌లపై ఉన్న ధూళిని తుడవాలి. ఆ తర్వాత ఫర్నిచర్, టేబుళ్లను శుభ్రం చేయాలి. చివరగా మాత్రమే నేలను ఊడ్చడం, తుడవడం చేయాలి. ముందే నేల తుడిచి, తర్వాత ఫ్యాన్లు తుడిస్తే పైనుంచి పడే దుమ్ము వల్ల నేల మళ్లీ మురికిగా మారుతుంది.

ఒక గది శుభ్రత పూర్తిగా పూర్తయిన తర్వాత మాత్రమే మరో గదికి వెళ్లాలి. శుభ్రతకు కావలసిన మైక్రోఫైబర్ బట్టలు, క్లీనింగ్ లిక్విడ్లు మొదట్లోనే సిద్ధంగా ఉంచుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. ఈ చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే మీ ఇల్లు నిమిషాల్లో మెరిసిపోతుంది!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us