
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కరివేపాకులో విటమిన్ A, B, C, E లతో పాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయాన్నే వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమై అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. మరిన్ని లాభాలు తెలిస్తే కరివేపాకు ఆకు ఇకపై అస్సలు పక్కన పెట్టారు..
ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమవుతాయి. ఇవి ఆహారాన్ని సులభంగా విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి రోజువారీ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కరివేపాకు సహజమైన మందులా పనిచేస్తుంది.
అదనపు బరువును తగ్గించుకోవాలనుకునే వారికి కరివేపాకు ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే వీటిని తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ, వేగవంతమై, కొవ్వు కరిగే ప్రక్రియ ముమ్మరమవుతుంది. ఇది ఆకలి కోరికలను నియంత్రించి ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
మధుమేహంతో బాధపడేవారికి కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో వీటిని నమలడం వల్ల రక్తంలో ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు సడన్ గా పెరగకుండా నియంత్రించి, డయాబెటిస్ వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గిస్తుంది.
కరివేపాకులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు కుదుళ్లకు తగిన పోషణను అందిస్తాయి. రోజూ ఉదయాన్నే కరివేపాకు తీసుకోవడం వల్ల జుట్టు అకాలంగా తెల్లబడటం తగ్గుతుంది. అంతేకాకుండా, జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, తీవ్రమైన జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
శరీరంలోని వ్యర్థాలను, టాక్సిన్లను బయటకు పంపడంలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కరివేపాకులోని డీటాక్సిఫైయింగ్ గుణాలు కాలేయాన్ని శుభ్రపరిచి, దాని పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి, మార్నింగ్ రోటిన్ లో భాగంగా ప్రతిరోజూ 4 నుండి 6 తాజా కరివేపాకులను నమలడం లేదా వాటితో కషాయం చేసుకుని తాగడం అలవాటు చేసుకోండి. ఈ చిన్న అలవాటు మీ మొత్తం శారీరక ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో గొప్ప సహాయకారిగా మారుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..