Fridge Clean: ఫ్రిజ్‌ క్లీన్‌గా ఉండాలంటే ఈ 5 పద్దతులు తప్పనిసరి..! ఏంటో తెలుసుకోండి..

|

Sep 22, 2021 | 2:24 PM

Fridge Clean: కిచెన్‌లో ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులలో ఫ్రిజ్‌ ఒకటి. చాలా సార్లు దానిని ఓపెన్‌ చేస్తూ క్లోజ్‌ చేస్తూ ఉంటారు. ఆహారాన్ని

Fridge Clean: ఫ్రిజ్‌ క్లీన్‌గా ఉండాలంటే ఈ 5 పద్దతులు తప్పనిసరి..! ఏంటో తెలుసుకోండి..
Fridge Clean
Follow us on

Fridge Clean: కిచెన్‌లో ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులలో ఫ్రిజ్‌ ఒకటి. చాలా సార్లు దానిని ఓపెన్‌ చేస్తూ క్లోజ్‌ చేస్తూ ఉంటారు. ఆహారాన్ని నిల్వ చేయాలన్నా, తాజాగా ఉంచాలన్నా ఫ్రిజ్‌ తప్పనిసరి. అందుకే ఇది తాజాగా ఉండాలి. లేదంటే చాలా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అయితే రిఫ్రిజరేటర్‌ని క్లీన్‌ గా ఉంచాలంటే ఈ 5 చిట్కాలు పాటించాలి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. ముందుగా ఆహారపదార్థాలు బయటపెట్టాలి
ఫ్రిజ్‌ క్లీన్ చేస్తున్నప్పుడు ముందుగా అందులో ఉండే అన్ని ఆహార పదార్థాలను బయటపెట్టాలి. మనం పట్టించుకోకపోవడం వల్ల అందులో కొన్ని కుళ్లినవి, ఎక్కువగా వాసన వచ్చే ఆహార పదార్థాలు ఉంటాయి. వాటిని తీసి పారేయాలి.

2. గడ్డ కట్టిన ఐస్‌ని నెమ్మదిగా తొలగించాలి
క్లీన్ చేయడానికి ముందు ఫ్రీజర్ ప్లగ్ స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్ పక్కన తీసి పెట్టి, కొద్ది సమయం అలాగే ఉంచాలి. ఐస్ వదులైన తర్వాత కత్తితో తొలగించాలి. లేదంటే శుభ్రం చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది. అంతేకాదు బలవంతంగా ఐస్‌ తొలగిస్తే ఫ్రిజ్‌ చెడిపోయే ప్రమాదం ఉంది.

3. హెయిర్ డ్రయ్యర్ వాడాలి..
ఫ్రిజ్‌ క్లీన్ చేయడానికి హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించాలి. అప్పుడే ఫ్రిజ్‌ పూర్తిగా క్లీన్ అవుతుంది.
హెయిర్ డ్రయ్యర్ తో ఫ్రిజ్ లోపల తడిని పూర్తిగా తొలగించాలి. అంతేకాదు క్లీనింగ్‌ ప్రక్రియ కూడా సులభంగా జరుగుతుంది.

4. బేకింగ్ సోడా ఉపయోగించాలి
వంటగది క్లీనింగ్‌లో బేకింగ్‌ సోడా చాలాబాగా పనిచేస్తుంది. ఇది ఒక మ్యాజిక్ పౌడర్ లాంటిది. ఇది అన్ని వస్తువులను సులభంగా శుభ్రం చేస్తుంది. సన్నని రంద్రాలున్న చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను నింపి ఫ్రిజ్ లో ఒక మూలలో పెట్టడం వల్ల చెడువాసనలు స్ర్పెడ్ కాకుండా ఉంటాయి.

5. తడి ఆరనివ్వాలి
ఫ్రిజ్‌ మొత్తం శుభ్రం చేసిన తర్వాత అందులో వెంటనే ఆహార పదార్థాలను నింపకూడదు. కొద్దిసేపు డోర్ తెరిచి తడి ఆరనివ్వాలి. క్లీనింగ్ ప్రొసెస్ పూర్తి అయిన తర్వాత మీ ఆహార పదార్థాలు తిరిగి నిల్వ చేయాలి. ఆహార పదార్థాల మధ్య కొంచెం స్థలం ఉండేలా చూసుకుంటే మంచిది.

Vellampalli: ‘ప్రజలు కోరుకుంటున్నది మాటల మనష్యుల్ని కాదు.. చేతల మనిషి వైయస్‌ జగన్‌ను’

Minor Girl Raped: మైనర్ బాలికపై అత్యాచారం.. కన్నతల్లే ముందుండి మరీ.. విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Nandamuri Balakrishna : లైగర్ టీమ్‌ను సర్‌ప్రైజ్ చేసిన లయన్.. నట సింహం ఎంట్రీతో సెట్‌లో సందడి..