Bathing: స్నానం చేసేటప్పుడు ఆ మూడు భాగాలనే మర్చిపోతారట.. అవే చాలా డేంజర్..

|

Jun 22, 2024 | 5:43 PM

ఆహారం తినడంలాగే, రోజూ స్నానం చేయడం కూడా ఆరోగ్యానికి ముఖ్యమైనదే.. శారీరక పరిశుభ్రత కూడా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. అయితే స్నానం చేయడం అంటే కేవలం శరీరంపై నీరు పోయడం మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి. బదులుగా ప్రతి భాగాన్ని శుభ్రం చేసుకోవాలి.. అటువంటి పరిస్థితిలో, మీరు స్నానం చేసేటప్పుడు కొన్ని భాగాలను శుభ్రం చేయకపోతే..

Bathing: స్నానం చేసేటప్పుడు ఆ మూడు భాగాలనే మర్చిపోతారట.. అవే చాలా డేంజర్..
Shower
Follow us on

ఆహారం తినడంలాగే, రోజూ స్నానం చేయడం కూడా ఆరోగ్యానికి ముఖ్యమైనదే.. శారీరక పరిశుభ్రత కూడా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. అయితే స్నానం చేయడం అంటే కేవలం శరీరంపై నీరు పోయడం మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి. బదులుగా ప్రతి భాగాన్ని శుభ్రం చేసుకోవాలి.. అటువంటి పరిస్థితిలో, మీరు స్నానం చేసేటప్పుడు కొన్ని భాగాలను శుభ్రం చేయకపోతే, భవిష్యత్తులో మీకు సమస్యలు తలెత్తవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

చాలా మంది ప్రజలు స్నానం చేయడం చాలా సులభమైన పని అని అనుకుంటారు.. కానీ నిజంగా మీ శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుంటున్నారా..? లేదా..? అనేదే ముఖ్యమని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. మనలో చాలా మంది స్నానం చేసేటప్పుడు కొన్ని మురికి శరీర భాగాలను శుభ్రం చేసుకోవడం మర్చిపోతారని, వాటివల్ల కూడా ఆరోగ్యం ప్రభావం చూపుతుందని పరిశోధకులు వివరించారు.

ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో సెప్టెంబరులో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. శరీరంలోని తేమ, జిడ్డుగల భాగాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే, ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా శరీరంలో పెరగడం ప్రారంభిస్తుంది. ఇది దుర్వాసనను కలిగించడమే కాకుండా, తామర, దద్దుర్లు, దురద వంటి చర్మ సమస్యలను కూడా కలిగిస్తుంది. ఏయే భాగాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకోండి..

నాభి

ఉదరము ఉపరితలంలో ఉండే భాగాన్ని నాభి అంటారు.. ఇది గుంత మాదిరిగా ఉంటుంది.. దీనిలో చాలా మురికి పేరుకుపోతుంది.. చనిపోయిన చర్మ కణాలు, చెమట చేరుతుంది.. అటువంటి పరిస్థితిలో, మీరు దానిని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే, అది ఫంగల్ లేదా బ్యాక్టీరియా సంక్రమణకు కారణం కావచ్చు.

శుభ్రపరిచే విధానం- నీరు, సబ్బుతో నాభిని సున్నితంగా శుభ్రం చేయండి. మీరు మృదువైన వస్త్రముతో నాభి లోపలి భాగాన్ని శుభ్రం చేసుకోవచ్చు..

చెవి వెనుక భాగం..

చెవుల వెనుక భాగం కూడా చాలా మురికిగా ఉంటుంది. ఈ భాగాల్లో చర్మం చిన్న పొరలు ఉన్నాయి.. దీని కారణంగా చెమట, చనిపోయిన చర్మ కణాలు అందులో పేరుకుపోతాయి. అటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతాన్ని ప్రతిరోజూ శుభ్రం చేయకపోతే, అది దురద, మంటను కలిగించే అవకాశం ఉంటుంది.

శుభ్రపరిచే విధానం: స్నానం చేస్తున్నప్పుడు, మీ చేతులతో లేదా వాష్‌క్లాత్‌తో చెవుల వెనుక భాగాన్ని సున్నితంగా రుద్దండి. ఏమైనా గాయాలు, కుట్లు వేసినట్లయితే, ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయండి.

కాలి వేళ్ల మధ్య భాగాలు..

కాలి వేళ్ల మధ్య ప్రాంతంలో చాలా తేమ పేరుకుపోతుంది. దీని వల్ల ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది. నిత్యం శుభ్రం చేయకపోతే అథ్లెట్స్ ఫుట్ వంటి సమస్యలు వస్తాయి.

శుభ్రపరిచే విధానం- మీ పాదాలను కడుక్కునేటపుడు, మీ కాలి మధ్య సబ్బుతో బాగా శుభ్రం చేసుకోండి. తర్వాత టవల్ సహాయంతో బాగా తుడవాలి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ చూడండి..