కరోనా మ‌ృతుడికి అంతిమ సంస్కారాలు చేయించిన జెడ్పీ ఛైర్మన్

కరోనాతో మృతి చెందిన వారికి అంతిమ వీడ్కోలు పలికేందుకు కుటుంబసభ్యులే ముందుకురాని పరిస్థితుల్లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కొవిడ్ తో చనిపోయిన వ్యక్తికి దగ్గరుండి దహన సంస్కారాలు చేయించి మానవత్వాన్ని చూపించారు.

కరోనా మ‌ృతుడికి అంతిమ సంస్కారాలు చేయించిన జెడ్పీ ఛైర్మన్

కరోనాతో మృతి చెందిన వారికి అంతిమ వీడ్కోలు పలికేందుకు కుటుంబసభ్యులే ముందుకురాని పరిస్థితుల్లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కొవిడ్ తో చనిపోయిన వ్యక్తికి దగ్గరుండి దహన సంస్కారాలు చేయించి మానవత్వాన్ని చూపించారు. మంథని పట్టణంలోని సత్యసాయినగర్‌కు చెందిన 29 ఏళ్ల యువకుడు మూడు రోజుల కిందట అస్వస్థతకు గురవగా వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కరీంనగర్‌లో శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ ఆ యువకుడు తుది శ్వాస విడిచాడు. మృతదేహాన్ని మంథనికి తరలించగా, అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరు ముందుకు రావడానికి ఇష్టపడలేదు.

విషయం తెలుసుకున్న జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆ యువకుడి కుటుంబానికి అండగా నిలిచాడు. బంధువులతో మాట్లాడి, ఒప్పించారు. కొందరు ముందుకు రాగా, వారి సహాయంతో దగ్గరుండి గోదారి తీరంలో అంతిమ సంస్కారాలు చేయించారు. కరోనా సోకిన వారితో ప్రేమగా ఉండాలని, నిర్లక్ష్యం చేయొద్దన్నారు పుట్ట మధు. మనోధైర్యం కల్పిస్తే బాధితులు త్వరగా కోలుకుంటారని, మనస్థైర్యాన్ని దెబ్బతిస్తే గుండెనిబ్బరం కోల్పోయి మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. మానవ విలువలను మంటగలిపేలా ప్రవర్తించవద్దని, జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా మృతులకు దహన సంస్కారాలు నిర్వహించాలని కోరారు.

Click on your DTH Provider to Add TV9 Telugu