Trump: అధ్యక్ష పీఠాన్ని వీడుతోన్న వేళ ట్రంప్‌నకు దెబ్బ మీద దెబ్బ… ఈసారి యూట్యూబ్‌ వంతు..

| Edited By: Pardhasaradhi Peri

Jan 14, 2021 | 9:10 AM

Youtube Suspends Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్‌ కీర్తి రోజురోజుకూ మసకబారుతోంది. తన అనాలోచిత నిర్ణయాలతో ట్రంప్‌ తన పేరును తానే చెడగొట్టుకుంటున్నారు. ఇటీవల...

Trump: అధ్యక్ష పీఠాన్ని వీడుతోన్న వేళ ట్రంప్‌నకు దెబ్బ మీద దెబ్బ... ఈసారి యూట్యూబ్‌ వంతు..
Follow us on

Youtube Suspends Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్‌ కీర్తి రోజురోజుకూ మసకబారుతోంది. తన అనాలోచిత నిర్ణయాలతో ట్రంప్‌ తన పేరును తానే చెడగొట్టుకుంటున్నారు. ఇటీవల జరుగుతోన్న పరిణామాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటికే ప్రముఖ టెక్‌ దిగ్గజాలు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ట్రంప్‌ ఖాతాలను బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలో యూట్యూబ్‌ కూడా వచ్చి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానల్‌ను వారం పాటు నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇటీవల ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో హింసను ప్రేరేపిస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను పోస్ట్‌ చేశారనే కారణంగా యూట్యూబ్‌ సదరు వీడియోను తొలగించింది. ఆ వీడియో వివరాలు వెల్లడించాలని యూట్యూబ్‌ ఆదేశించింది. ఒక వారం తర్వాత ఛానల్‌పై తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ‘ట్రంప్‌ మా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన కారణంగా ఆయన 7 రోజులపాటు కొత్త వీడియోలను అప్‌లోడ్‌ చేయలేరు అదే సమయంలో లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా చేయలేరని’ యూట్యూబ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: ట్రంప్ అభిశంసనలో మరో అడుగు, 25 వ సవరణకు మైక్ పెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఉద్దేశించిన తీర్మానానికి సభ ఆమోదం