వండర్ కలెక్టర్ టీచరైన వేళ!

|

Nov 05, 2020 | 5:36 PM

ఓ జిల్లా కలెక్టర్ ఉన్నట్లుండి ఉపాధ్యాయుని అవతారమెత్తారు. క్లాస్ రూంలో విద్యార్థులకు బోధించారు. బ్లాక్ బోర్డుపై పాయింట్ వైస్‌గా రాస్తూ.. వాటిని విద్యార్థులకు వివరించారు. తాను నిజంగానే వండర్ కలెక్టర్‌నని చాటుకున్నారు.

వండర్ కలెక్టర్ టీచరైన వేళ!
Follow us on

Wonder collector became a teacher: ఆసక్తికరమైన చర్యలతో ఇప్పటికే వండర్ కలెక్టర్‌గా పేరు గాంచిన అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడు గురువారం ఉపాధ్యాయుని అవతారమెత్తారు. పాఠశాలలలో ఆకస్మిక తనిఖీకి బయలుదేరిన జిల్లా కలెక్టర్ బుక్కరాయసముద్రం మండలం సిద్దారాంపురం జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్‌గా మారి కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను విద్యార్థులకు వివరించారు.

గురువారం పాఠశాల బాట పట్టారు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ చంద్రుడు ఉన్నట్లుండి ఉపాధ్యాయుడిలా మారారు. కరోనా నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ఉపాధ్యాయుడిలా బ్లాక్ బోర్డ్ మీద రాసి విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ కూడా మధ్యాహ్న భోజనం చేశారు.

‘‘ కరోనా తర్వాత జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలు ప్రారంభమయ్యాయి.. ఇప్పటివరకు 12 వేల మంది ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాం.. ఇందులో కేవలం 4 శాతం మాత్రమే కరోనా పాజిటివ్‌గా తేలారు. మొదట్లో ఉపాధ్యాయుల హాజరు 80 శాతం ఉండగా.. పిల్లలది కేవలం 25 శాతం మాత్రమే ఉండేది.. ఇప్పుడు విద్యార్థుల హాజరు శాతం కూడా 80కి పైగా చేరింది.. కరోనాను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల్లో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పిల్లలకు ఈ విషయంలో తగిన సూచనలు చేస్తూ ఉండాలని ఆదేశించాం…’’ అని కలెక్టర్ చంద్రుడు మీడియాకు వివరించారు.

ALSO READ: భూసర్వేపై జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం

ALSO READ: బందరు పోర్టుపై కేబినెట్ కీలక నిర్ణయం

ALSO READ: టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు

ALSO READ: పాకిస్తాన్ మరో దుష్ట పన్నాగం.. ఇండియా తీవ్ర అభ్యంతరం