Telangana: మాజీ ఎమ్మెల్యే ఓదెలకు చేదు అనుభవం.. గో బ్యాక్ అంటూ మహిళల నినాదాలు.. కంగుతిన్న నేత

|

Aug 27, 2022 | 8:56 PM

ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో రాజకీయ వేడి భగ్గుమంది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో మాజీ విప్ నల్లాల ఓదేలుకు చేదు అనుభవం ఎదురైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి...

Telangana: మాజీ ఎమ్మెల్యే ఓదెలకు చేదు అనుభవం.. గో బ్యాక్ అంటూ మహిళల నినాదాలు.. కంగుతిన్న నేత
Ex Mla Odela
Follow us on

ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో రాజకీయ వేడి భగ్గుమంది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో మాజీ విప్ నల్లాల ఓదేలుకు చేదు అనుభవం ఎదురైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని నార్లపూర్ లో పర్యటినస్తున్న ఆయనను టీఆర్ఎస్ మహిళ నేతలు, గ్రామస్థులు అడ్డుకున్నారు. ఓదెలు (Odela) గో బ్యాక్ అంటూ మహిళలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అభివృద్ధి వైపు చూడని నల్లాల ఓదెలు ఏ ముఖం పెట్టుకొని గ్రామంలోకి వస్తారంటూ ప్రశ్నించారు. మమ్మల్ని ‌మోసం చేసి గోడ దూకావంటూ నిలదీశారు. ఊహించని హఠాత్పరిణామానికి ఓదెలు షాక్ అయ్యారు. స్థానిక మహిళలను, టీఆర్ఎస్ నేతలను‌ సముదాయించారు. మన్నించాలని కోరారు.

కాగా.. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ వెళ్లిన ఓదెలు దంపతులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. అనంతరం ఓదెలు దంపతులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఓదెలు 2009, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..