వ‌క్షోజాలే ఆమె ప్రాణాల‌ను నిలిపాయ్..

ముప్పై ఏండ్ల ఒక‌ ఓ మ‌హిళ సెల్‌ఫోన్ చూసుకుంటూ రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న‌ది. ఇంత‌లో ఒక్క‌సారిగా ఒక ఆగంత‌కుడు గ‌న్ తో ఆమె ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ఏం జ‌రుగుతుందో తెలుసుకునేలోపే.. ఆమె ఛాతీ ఎడ‌మ భాగంలో బుల్లెట్ దిగిపోయింది. అంత ద‌గ్గ‌ర్లోనుంచి కాల్చితే బుల్లెట్ గుండెల్లోకి దూసుకుపోయి చ‌నిపోవ‌డం ఖాయం. కానీ ఆమె చ‌నిపోలేదు! ఎందుకంటే అస‌లు ఆ బుల్లెట్ గుండెలోప‌లి వ‌రకు వెళ్ల‌లేదు. విన‌డానికి కాస్త‌ ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం! ఆమె ఛాతీలోకి వెళ్లిన […]

వ‌క్షోజాలే ఆమె ప్రాణాల‌ను నిలిపాయ్..

Edited By:

Updated on: Apr 27, 2020 | 8:43 AM

ముప్పై ఏండ్ల ఒక‌ ఓ మ‌హిళ సెల్‌ఫోన్ చూసుకుంటూ రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న‌ది. ఇంత‌లో ఒక్క‌సారిగా ఒక ఆగంత‌కుడు గ‌న్ తో ఆమె ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ఏం జ‌రుగుతుందో తెలుసుకునేలోపే.. ఆమె ఛాతీ ఎడ‌మ భాగంలో బుల్లెట్ దిగిపోయింది. అంత ద‌గ్గ‌ర్లోనుంచి కాల్చితే బుల్లెట్ గుండెల్లోకి దూసుకుపోయి చ‌నిపోవ‌డం ఖాయం. కానీ ఆమె చ‌నిపోలేదు! ఎందుకంటే అస‌లు ఆ బుల్లెట్ గుండెలోప‌లి వ‌రకు వెళ్ల‌లేదు.

విన‌డానికి కాస్త‌ ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం! ఆమె ఛాతీలోకి వెళ్లిన బుల్లెట్ నేరుగా గుండెలోకి దిగ‌కుండా కుడివైపున‌కు డైవ‌ర్ట్ అయ్యి కుడి వ‌క్షో‌జంలోకి వెళ్లింద‌ట‌. దీంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. బుల్లెట్ ఎందుకు ట‌ర్న్ అయ్యింద‌నేగా మీ డౌబ్ట్. అక్క‌డికే వ‌స్తున్నాం. ఆ మ‌హిళ గ‌తంలో బ్రెస్ట్ ఇంప్లాట్ స‌ర్జ‌రీ చేయించుకోవ‌డ‌మే ఆమె చ‌నిపోకుండా ఉండ‌టానికి కార‌ణం‌. ఛాతి భాగం అందంగా క‌నిపించ‌డం కోసం వ‌క్షోజాల్లో సిలికాన్ బెలూన్ల‌ను అమ‌ర్చుకోవ‌డాన్నే బ్రెస్ట్ ఇంప్లాంటేష‌న్ అంటారు. కాల్పుల్లో మ‌హిళ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పూర్తిగా దెబ్బ‌తిన‌డంతో అప్పుడు వాటిని తొల‌గించి మ‌ళ్లీ స‌ర్జ‌రీ చేశారు.

కాగా, ఈ ఘ‌ట‌న 2018లో కెన‌డా రాజ‌ధాని టొరంటోలో జ‌రిగింది. తాజాగా జియాన్ కార్లో మెక్ అవెన్యూ అనే ఒక ఫేమస్ స‌ర్జ‌న్ ఆ ఘ‌ట‌నపై కేస్ స్ట‌డీ చేశాడు. బ్రెస్ట్ ఇంప్లాంటేష‌న్ మ‌హిళ‌ను ప్రాణాల‌తో కాపాడింద‌ని గుర్తించి ఒక నివేదిక‌ త‌యారుచేశాడు. ఆ అనాల‌సిస్ తాజాగా సేజ్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురితం కావ‌డంతో ఈ విష‌యం మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది.

Follow Us