AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman Was Chained Herself : ఇదేం ‘చైన్ ప్రేమ’ ? చేతులకు మూడు నెలల పాటు సంకెళ్లు వేసుకున్న ప్రేమికులు..

ప్రేమను పంచుకోవడానికి మార్గాలెన్నో ! ప్రేయసీ ప్రియులు ఒకరికొకరు బొకేలు ఇచ్చుకోవడమో., గిఫ్ట్ లు షేర్ చేసుకోవడమో, లేదా కాలం తెలియకుండా ఎన్నో ఊసులు..

Woman Was Chained Herself : ఇదేం 'చైన్ ప్రేమ' ? చేతులకు మూడు నెలల పాటు సంకెళ్లు వేసుకున్న ప్రేమికులు..
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 28, 2021 | 1:37 PM

Share

ప్రేమను పంచుకోవడానికి మార్గాలెన్నో ! ప్రేయసీ ప్రియులు ఒకరికొకరు బొకేలు ఇచ్చుకోవడమో., గిఫ్ట్ లు షేర్ చేసుకోవడమో, లేదా కాలం తెలియకుండా ఎన్నో ఊసులు చెప్పుకోవడమో పరిపాటి. హద్దుల్లేని ప్రేమకు నిదర్శనాలు చాలానే ఉన్నాయి. కానీ మరీ శరీర భాగాలు గాయపరచుకునేంతగా లవర్స్ తమ ప్రేమను లోకానికి చాటి చెప్పాలనుకుంటే మాత్రం డేంజరే ! ఉదాహరణకు ఉక్రెయిన్ లో ఓ జంట ఇలాగే కనీవినీ ఎరుగని ‘ప్రయోగం’ చేసి చిక్కుల్లో పడింది. చివరకు డాక్టర్ల సలహాతో తమ ‘సంకెళ్ళ బంధాన్ని’ వీడాల్సి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే..విక్టోరియా పుస్తోవిటోవా అనే 28 ఏళ్ళ యువతి, అలెగ్జాండర్ కుడ్లే అనే 33 ఏళ్ళ యువకుడు తమ గాఢమైన లవ్ ను ప్రపంచానికి చాటాలనుకున్నారు. అంతే ! ఇద్దరూ ఒకరికొకరు తమ  చేతులకు సంకెళ్లు వేసేసుకున్నారు. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా మూడు నెలలపాటు ఇలా  గడుపుతూ వచ్చారు. రోజువారీ దైనందిన కార్యక్రమాలు, వంట చేసుకోవడం, కారులోడ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం.. ఇలా చేతులకు సంకెళ్ళతోనే !

కానీ కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట.. రెస్టారెంట్, పబ్లిక్ ప్లేసుల్లో వెళ్ళినప్పుడు ఈ చిక్కులన్నీ వారికీ తలెత్తాయి. మహిళలకు ఉద్దేశించిన వాష్ రూమ్స్ కి విక్టోరియా తనతో బాటు తన బాయ్ ఫ్రెండును కూడా తీసుకువెళ్ళినప్పుడు అక్కడే ఉన్న చాలామంది అభ్యంతరం చెప్పడం, వారిని విసుక్కోవడం జరిగింది. అయితే కొందరు మాత్రం ఈ సంకెళ్ళ ప్రేమికులను అభినందించారట కూడా !అలెగ్జాండర్ ఆన్ లైన్ ద్వారా కారు విడిభాగాలు అమ్ముతుంటే.బ్యూటిషియన్ అయిన  విక్టోరియా..  లాక్ డౌన్ కాలంలో ట్రెయినింగ్ పొందుతూ వచ్చిందట. అయితే సంకెళ్ళ కారణంగా విక్టోరియా చేతుల మీద బొబ్బలు  ఏర్పడి అవి పుండ్లు గా మారడంతో ఇద్దరూ ఆసుపత్రికి వెళ్లారు.  విక్టోరియా నొప్పిని భరించలేక పోతుంటే డాక్టర్లు ఆమె చేతికి బ్యాండేజీ కట్టారు. కానీ ఇలా మీరు మరికొంత కాలం ఉంటే తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని గట్టిగా హెచ్ఛరించడంతో ఈ లవర్స్ ఇద్దరూ ఇక తమ చేతులకు సంకెళ్లు తీయక తప్పలేదు.

Read More:

Google Search: గూగుల్‌లో వీటి గురించి ఎట్టిపరిస్థితుల్లో వెతకకూడదు.. ఇంతకీ అవేంటంటే..

Andhra donkeys missing: లైంగిక శక్తి పెరుగుతుందని, వీర్యపుష్టి కలుగుతుందని ప్రచారం.. ఏపీలో గాడిదలు కనుమరుగు