Breaking : హత్రాస్ కేసు విచారణ అధికారి భార్య ఆత్మహత్య

|

Oct 24, 2020 | 8:08 PM

హత్రాస్ హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు  రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగుతోన్న నేపథ్యంలో యూపీ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

Breaking : హత్రాస్ కేసు విచారణ అధికారి భార్య ఆత్మహత్య
Follow us on

హత్రాస్ హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు  రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగుతోన్న నేపథ్యంలో యూపీ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో అత్యంత నిజాయితీపరుడిగా పేరున్న చంద్ర ప్రకాష్ సభ్యుడిగా ఉన్నారు. తాజాగా ఆయన భార్య పుష్ప ప్రకాశ్ శనివారం లక్నోలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలు వయసు 36 సంవత్సరాలు. ఆమె తన ముగ్గురు కుమార్తెలతో కలిసి లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీలో నివశిస్తున్నారు.

 డీఐజీ చంద్ర ప్రకాశ్ ప్రస్తుతం ఉన్నావాలోని పోలీసు ట్రైనింగ్  సెంటర్‌లో పనిచేస్తున్నారు. శనివారం ఉదయం చంద్ర ప్రకాశ్ తన ఆఫీసుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పుష్ప బెడ్రూంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు పుష్ప ప్రకాశ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని, మృతిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read :
అక్కడ బుల్లెట్‌కు పూజలు, గుడి కూడా కట్టేశారు !
హైదరాబాదులో పాల ఏటీఎం