ఎల్‌జీ పాలిమర్స్‌కు ₹50 కోట్ల మధ్యంతర జరిమానా..

| Edited By: Pardhasaradhi Peri

May 08, 2020 | 4:21 PM

నియమాలు, నిబంధనలను పాటించడంలో విఫలమైనందున జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఎల్జీ పాలిమర్స్ ఇండియాకు రూ .50 కోట్ల మధ్యంతర జరిమానా విధించింది. వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్​ (ఎన్జీటీ) కేంద్ర

ఎల్‌జీ పాలిమర్స్‌కు ₹50 కోట్ల మధ్యంతర జరిమానా..
Follow us on

Vizag gas leak: నియమాలు, నిబంధనలను పాటించడంలో విఫలమైనందున జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఎల్జీ పాలిమర్స్ ఇండియాకు రూ .50 కోట్ల మధ్యంతర జరిమానా విధించింది. వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్​ (ఎన్జీటీ) కేంద్ర ప్రభుత్వం, ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా, జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డుకు (సీపీసీబీ) నోటీసులు జారీ చేసింది.

కాగా.. రసాయన కర్మాగారంలో గురువారం జరిగిన గ్యాస్ లీక్ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఎన్‌జిటి చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం 5 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి మే 18 లోపు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.

నివేదికను రూపొందించేందుకు.. నిజనిర్ధారణ బృందానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను విశాఖపట్నం కలెక్టర్‌ అందించాలని కూడా ఎన్జీటీ ఆదేశించింది. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సీపీసీబీ ఛైర్మన్‌కు సూచించింది. ఘటనకు కారణాలు ఏమిటి? ఎంత మంది మరణించారు?ఎంతమందిపై దీని ప్రభావం ఉంది? పర్యావరణానికి ఎంతమేరకు ముప్పు వాటిల్లింది? జీవరాశులకు జరిగిన నష్టం ఏమిటి? అధికారుల పాత్ర ఎంత? అనే అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఎన్జీటీ.. కమిటీని కోరింది.

Also Read: కర్నూలులో టెన్షన్.. ఒకే కుటుంబంలో ఏకంగా ఐదుగురికి కరోనా..