నువ్వెంట్రా ఇలా ఉన్నావ్..? నీ తోకేంట్రా..? చింపాంజీ ఫన్నీ వీడియో వైరల్

|

Apr 04, 2021 | 6:53 PM

ఎంట్రా..? నువ్‌ ఇలా ఉన్నవ్‌..నీ మూతేంటి ఇలా ఉంది..నీ మోహం ఎందుకు విచిత్రంగా ఉంది... నీ బాడీ టోటల్‌ తేడాగా ఉంది..నీ తోకేంట్రా ఇంతే ఉంది

నువ్వెంట్రా ఇలా ఉన్నావ్..? నీ తోకేంట్రా..? చింపాంజీ ఫన్నీ వీడియో వైరల్
Chimpanzee
Follow us on

ఎంట్రా..? నువ్‌ ఇలా ఉన్నవ్‌..నీ మూతేంటి ఇలా ఉంది..నీ మోహం ఎందుకు విచిత్రంగా ఉంది… నీ బాడీ టోటల్‌ తేడాగా ఉంది..నీ తోకేంట్రా ఇంతే ఉంది….అసలు నువ్‌..ఎవరూ బాయ్‌..ఈ వీడియో చూస్తుంటే మీకు ఇలాగే అనిపిస్తుంది..కదూ..! ఈ రెండింటి మధ్య సంభాషణ ఇదే జరిగుంటుందేమో బాహుషా..!

ప్రతిరోజూ ఏదో ఒక వైరల్‌ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది. అందులో అనేకం ఫన్నీ సీన్సే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా..ఎవరూ షేర్‌ చేశారో తెలియదు గానీ, నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ప్రశాంతంగా ఉన్న పార్క్‌లోకి ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఓ చిరుతపులి పిల్ల ఒంటరిగా కనిపించింది. అంతలోనే అటుగా వచ్చిన చింపాంజీ ఆ చిరుత పిల్లను విచిత్రంగా చూసింది. చిరుత పిల్ల మూతి నుంచి తోక వరకు ఇలా పరిశీలించింది. చింపాంజీకి చిరుతకు భారీ వ్యత్యాసం ఉండటంతో అది విచిత్రంగా చూసింది. నీ మూతి ఏంటి..? నీ మొహం ఏంటి..? వెనక ఆ తోకేంటి.? అంటూ చింపాంజీ విచిత్రంగా చూస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. క్షణాల్లో ఈ వీడియో పై లైకులు వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

రైతన్నలను ముప్పుతిప్పలు పెడుతున్న ఎలుకలు.. గగ్గోలు పెడుతున్న అన్నదాతలు

Ostrich Bird Egg Food: ప్రపంచంలోనే అతి పెద్ద గుడ్డు.. ఈ గుడ్డు 15 మంది వరకూ ఫుడ్డు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా..!

చిన్నారి కళ్లలో మెరుపు పట్టలేని ఆనందం! వైరల్ అవుతున్న చిన్నారి వీడియో.: Small girl amazing reaction video.