రేర్ సీన్: 240 ఏళ్లకు కనిపించిన ఫిష్ ఈగిల్.!

| Edited By:

May 08, 2020 | 12:49 PM

ఓ వైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. దీంతో పర్యావరణానికి మాత్రం మేలు జరిగింది. ఇకపోతే, దాదాపు 240 ఏళ్ల క్రితం కనుమరుగైన ఓ

రేర్ సీన్: 240 ఏళ్లకు కనిపించిన ఫిష్ ఈగిల్.!
Follow us on

Fish Eagle: ఓ వైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. దీంతో పర్యావరణానికి మాత్రం మేలు జరిగింది. ఇకపోతే, దాదాపు 240 ఏళ్ల క్రితం కనుమరుగైన ఓ పక్షి ఇప్పుడు మళ్లీ కనిపించింది. దీంతో బ్రిటన్‍లోని పక్షి ప్రేమికుల ఆనందానికి అవధులు లేవు.

వివరాల్లోకెళితే.. వీటిని ఫిష్ ఈగిల్ అని కూడా పిలుస్తారు, ఇవి UK యొక్క అతిపెద్ద పక్షి. తెల్లని తోక, పెద్ద రెక్కలతో ఉండే ఈ గద్దని ప్రే బర్ద్ గా పేర్కొంటారు. ఈ పక్షులకు నల్లటి చీలిక తోకలు, కట్టిపడేసిన పసుపు రంగు ముక్కు, పసుపు రంగు కాళ్ళు, బంగారు రంగు కళ్ళు ఉంటాయి. తెల్ల తోకగల ఈగల్స్ వేసవిలో చేపలను వేటాడుతాయి. ఈ పక్షి రెక్కలు రెండున్నర మీటర్ల పొడవు ఉంటాయి.

కాగా.. ఈ పక్షి చివరిసారిగా 1780వ సంవత్సరంలో కనిపించిదట. 18వ శతాబ్దంలో వీటిని విచక్షణారహితంగా వేటాడి చంపడంతో వీటి సంఖ్య తగ్గిపోయింది. వీటిని సిట్-అండ్-వెయిట్ పక్షులు అని పిలుస్తారు, ఇవి ఆహారం కోసం మైళ్ళు ఎగరడానికి బదులుగా ఒక దగ్గర కూర్చుండటానికి ఇష్టపడతాయట.

Also Read: కర్నూలులో టెన్షన్.. ఒకే కుటుంబంలో ఏకంగా ఐదుగురికి కరోనా..