భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు లష్కరే టాప్‌ కమాండర్లు హతం

| Edited By:

Aug 16, 2020 | 8:14 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో శనివారం రాత్రి ఉగ్రవాదులకు, ఆఫ్ఘన్ సైన్యానికి మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. డాంగం జిల్లా కునర్ ప్రావిన్స్‌లో నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్), ఆప్ఘాన్ నేషనల్ ఆర్మీ..

భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు లష్కరే టాప్‌ కమాండర్లు హతం
Follow us on

ఆఫ్ఘనిస్థాన్‌లో శనివారం రాత్రి ఉగ్రవాదులకు, ఆఫ్ఘన్ సైన్యానికి మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. డాంగం జిల్లా కునర్ ప్రావిన్స్‌లో నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్), ఆప్ఘాన్ నేషనల్ ఆర్మీ(ఏఎన్ఏ) కలిసి ఉగ్రవేట చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు టాప్‌ కమాండర్లు కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు టాప్ కమాండర్లను పచా ఖాన్, అఖ్తర్‌గా గుర్తించారు.

కాగా, పచా ఖాన్ షాహి తంగై జిల్లాకు చెందిన వాడు కాగా.. బజార్ అనే ఉగ్రవాది ఖైబర్ ప్రావిన్స్‌కు చెందిన వాడిగా గుర్తించారు. డాంగం జిల్లా ఏరియాలో లష్కరే ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం అందడంతో.. వెంటనే ఆప్ఘన్ భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి ఆపరేషన్‌ చేపట్టింది.

Read More :

ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు