భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

|

Jul 10, 2020 | 11:32 AM

శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులను దోచుకుంటున్న నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ సీరియస్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఫేక్ వెబ్‌సైట్‌ కేసులో టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..
Follow us on

శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులను దోచుకుంటున్న నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ సీరియస్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఫేక్ వెబ్‌సైట్‌ కేసులో టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా తిరుచానూరుకు చెందిన ఆర్టీసీ కండక్టర్ రఘు శ్రీవారి దర్శనం పేరుతో ఆన్లైన్‌లో టికెట్ల కోసం ప్రయత్నించి.. ఒక ఫేక్ వెబ్‌సైట్‌కి రూ. 1995 చెల్లించాడు.

జూన్ 29న శ్రీవారి దర్శనం కోసం అదే నెల 25వ తేదీన రఘు 5 టికెట్లను కొన్నాడు. రూ. 300 దర్శనాన్ని తీసుకున్న రఘు.. ఇందుకోసం రూ. 1995 చెల్లించాడు. జూన్ 29 వరకు రఘుకు దర్శనం టికెట్లు చేతికి రాకపోవడం.. వెబ్‌సైట్ నిర్వాహకుల నుంచి ఎలాంటి మెయిల్ కూడా అందకపోవడంతో అవాక్కైన అతడు.. చివరికి టీటీడీ విచారణా విభాగాన్ని ఆశ్రయించాడు. అప్పుడు గానీ తాను మోసపోయానన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. దీనితో సీరియస్ అయిన టీటీడీ తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శ్రీవారి భక్తులు నకిలీ వెబ్‌సైట్ల జోలికి వెళ్ళొద్దని.. వాటిని నమ్మి మోసపోవద్దని టీటీడీ కోరింది. దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గదులను బుక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ అయిన‌ tirupatibalaji. ap.gov.inను వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఇతర సమాచారం కావాలంటే 1800 425 4141, 1800 425 333 333 .. టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చునని సూచించింది.

Also Read: తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!