టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు వచ్చేశాయి..

|

Oct 24, 2020 | 4:21 PM

గత నెలలో జరిగిన ఎంసెట్‌ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ రిజల్ట్స్‌‌ను రిలీజ్‌ చేశారు.

టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు వచ్చేశాయి..
Follow us on

Telangana Eamcet Results: గత నెలలో జరిగిన ఎంసెట్‌ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ రిజల్ట్స్‌‌ను రిలీజ్‌ చేశారు. ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ విభాగంలో 63,857 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. అందులో 59,113 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. తొలి మూడు ర్యాంకులు బాలికలు కైవసం చేసుకున్నారు. గుత్తి చైతన్య సింధుకు ఎంసెట్‌లో తొలి ర్యాంక్ రాగా.. త్రిషారెడ్డికి రెండో ర్యాంక్, స్నికితకు మూడో ర్యాంక్ వచ్చింది. ఇక నాలుగో ర్యాంక్ విష్ణుసాయి, రిషిత్ ఐదో ర్యాంక్ సాధించారు. ఫ‌లితాల కోసం www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. కాగా, ఈ నెల 6వ తేదీన ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే అక్టోబర్ 28న ఎడ్‌సెట్, నవంబర్ 2న ఐసెట్, 6న లాసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.

Also Read: మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త..