మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త..

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. ఈ నెల 26వ తేదీన(సోమవారం) దసరా ఆప్షనల్ హాలీడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Ravi Kiran
  • Publish Date - 3:21 pm, Sat, 24 October 20
Jagan Review Meeting

AP Government Decision: మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. ఈ నెల 26వ తేదీన(సోమవారం) దసరా ఆప్షనల్ హాలీడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవును ఈ నెల 25 నుంచి 26కి మార్చాలని మహిళా ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అభ్యర్ధనల మేరకు దసరా సెలవును ఈ నెల 25 నుంచి 26కు మారుస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి విదితమే.

ఇక కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే తమకు అక్టోబర్ 26న దసరా పండుగ సెలవుగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని.. రాష్ట్ర ఉద్యోగ సంఘాలు కోరడంతో.. ఈ నెల 26న సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఏపీ మహిళా ఉద్యోగులు కూడా జగన్ సర్కార్‌ను కోరారు. దానికి ప్రభుత్వం ఓకే చెప్పింది.

Also Read: తెలంగాణ నుంచి ఏపీ వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్..