TRS Party: గులాబీ దళంలో ఎమ్మెల్సీ రేస్

|

Feb 20, 2020 | 5:03 PM

టీఆర్‌ఎస్‌లో మళ్ళీ పదవుల పండగ మొదలైంది. ఈ పదవుల పండుగ ఆశావహుల్లో సంతోషం నింపితే మరి కొందరికి టెన్షన్ పుట్టిస్తోంది. ఖాళీ అవుతున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాల కోసం గులాబీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసీఆర్ గుడ్ లుక్స్‌లో పడేందుకు తండ్లాడుతున్నారు.

TRS Party: గులాబీ దళంలో ఎమ్మెల్సీ రేస్
Follow us on

TRS leaders are in race for MLC posts: టీఆర్‌ఎస్‌లో మళ్ళీ పదవుల పండగ మొదలైంది. ఈ పదవుల పండుగ ఆశావహుల్లో సంతోషం నింపితే మరి కొందరికి టెన్షన్ పుట్టిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్న నాయకుల్లో 2020 ఫీవర్ పట్టుకుంది. ఈ ఏడాదిలో 4 ఎమ్మెల్సీ స్థానాలు నేతలను ఊరిస్తున్నాయి. గవర్నర్ కోటాలో 3 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతుండగా నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ రానుంది. ఈ నాలుగు స్థానాలపై దాదాపు 40 మంది ఆశలు పెట్టుకున్నారు.

తమ పదవీ కాలం ఈ ఏడాదిలో ముగుస్తోంది. దీంతో తమకు రెన్యువల్ ఉంటుందో లేదో అనే గుబులు గులాబీ సీనియర్‌ నేతలకు పట్టుకుంది. మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఆయ్యారు. 2014లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం 2020 జూన్ నెలతో ముగుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఆయన అల్లుడికి టిక్కెట్ ఇవ్వలేదు.. ఆయనకు మంత్రివర్గంలో చాన్స్‌ ఇవ్వలేదు. దీంతో అప్పటి నుండి నాయిని పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు…బహిరంగంగానే ఆయన అవేదన వెళ్లగక్కిన నాయిని…రీసెంట్‌గా ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిశాక కార్మిక సంఘాల విషయంలో కూడా ప్రభుత్వ విధానానికి భిన్నంగామాట్లాడారు. దీంతో ఆయనకు ఈసారి పదవి డౌట్ అనే చర్చ జరుగుతోంది.

మరో ఎమ్మెల్సీ రాములు నాయక్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. రాములు నాయక్‌ను టీఆర్‌ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఆయన స్థానం కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. మరో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పదవీకాలం కూడా 2020 ఆగస్టు లొనే ముగుస్తుంది. కానీ ఇయనకు రెన్యూవల్ పక్కా అని తెలుస్తోంది.. ఎందుకు అంటే కర్నెకు విప్ పదవి కూడా కేటాయించారు సీఎం కేసీఆర్. రీసెంట్‌గా తానే కర్నె ప్రభాకర్ పదవి రెన్యూవల్‌పై వాకబు చేసి భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం స్వయంగా భరోసా ఇవ్వడంతో ఆయనకు లైన్ క్లియర్ అవ్వడమే కాకుండా ఆయన పదవి కన్నేసిన కొందరు నేతలు ప్రయత్నాలు ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది.

నిజమాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ స్థానంలో పోటీ చేసేందుకు చాలా మంది నేతలు క్యూలో ఉన్నారు. ఇలా మొత్తానికి నాయినికి 2020 టెన్షన్ పట్టుకుంటే..ఆశావహులు మాత్రం సంబర పడుతున్నట్టు తెలుస్తుంది…4 స్థానాల్లో ఒకటి కర్నె ప్రభాకర్‌కు కన్‌ఫర్మ్ అవ్వడంతో ఇక మిగితా 3 స్థానాలకు మాత్రం తీవ్ర పోటీ నెలకొంది…మరి గులాబీ బాస్ కేసీఆర్ ఆ మాజీ హోమ్ మంత్రికి తిరిగి అవకాశం ఇస్తారా లేదా అన్నది 2020 సమాధానం చెప్పబోతోంది.

Also read: Secret behind Undavalli comments on YS Jagan