చుక్కలనంటిన టమాట ధరలు, కేజీ ఎంతంటే ?

|

Sep 16, 2020 | 12:38 PM

దేశంలో టమాట రేట్లు మండిపోతున్నాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో పంటలు నీటమునిగాయి.

చుక్కలనంటిన టమాట ధరలు, కేజీ ఎంతంటే ?
Follow us on

దేశంలో టమాట రేట్లు మండిపోతున్నాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో పంటలు నీటమునిగాయి. మరికొన్ని చోట్ల పంట సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో సామాన్యులకు అందనంటుంది టమాట. ప్రస్తుతం రిటైల్​ మార్కెట్లలో ధరలు షాక్ కు గురిచేస్తున్నాయి. మిజోరం, మణిపుర్​​ సహా పశ్చిమ్ బెంగాల్ లోని పలు ప్రాంతాలలో టమాట ధరలు కిలోకు రూ.100కి చేరుకున్నాయి.

ఈ మేరకు టమాట, ఆలూ, ఉల్లి సహా 22 నిత్యావసర సరకుల ధరలపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు రిలీజ్ చేసింది. ఈ లెక్కల ప్రకారం దేశంలో టమాట సగటు ధర కిలోకు రూ.50గా ఉంది. ఆలూ, ఉల్లి సగటు రేట్లు కేజీకి రూ.35గా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. వీటి గరిష్ఠ ధర రూ. 60గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్​కతా, చెన్నై నగరాల్లో టమాట ధరలు వరుసగా రూ.63, రూ.68, రూ.80, రూ.50గా ఉన్నాయి. అయితే లోకల్ వ్యాపారలు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను లైట్ తీసుకుంటూ, అధిక రేట్లకు విక్రయాలు జరుపుతున్నారు.
Also Read :
విచారణకు పిలిస్తే, మాజీ రౌడీషీటర్ ఆగమాగం
టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు కన్నుమూత
ఎస్సై పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్..ఇక చూస్కోండి !