భారీ వ‌ర్షానికి త‌డిసిముద్దైన హైద‌రాబాద్ న‌గ‌రం

| Edited By:

Aug 12, 2020 | 9:56 PM

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తోంది. గ‌త కొద్ది రోజుల నుంచి రోజూ ఏదో ఒక స‌మ‌యంలో వ‌ర్షం కూరుస్తూనే ఉంది. బ‌ల‌మైన ఈదురు‌ గాలుల‌తో కూడిన భారీ వ‌ర్షానికి హైద‌రాబాద్ న‌గ‌రం త‌డిసిముద్ద‌యింది. కాగా భారీ వ‌ర్షంతో ప‌లు ప్రాంతాల్లో..

భారీ వ‌ర్షానికి త‌డిసిముద్దైన హైద‌రాబాద్ న‌గ‌రం
Follow us on

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తోంది. గ‌త కొద్ది రోజుల నుంచి రోజూ ఏదో ఒక స‌మ‌యంలో వ‌ర్షం కూరుస్తూనే ఉంది. బ‌ల‌మైన ఈదురు‌ గాలుల‌తో కూడిన భారీ వ‌ర్షానికి హైద‌రాబాద్ న‌గ‌రం త‌డిసిముద్ద‌యింది. కాగా భారీ వ‌ర్షంతో ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షపు నీరు నిలిచిపోయింది. అలానే కొన్ని చోట్ల విద్యుత్‌కి అంత‌రాయం ఏర్ప‌డింది. దిల్‌సుఖ్ న‌గ‌ర్, కోఠి, కుత్బుల్లాపూర్‌, ఎల్బీన‌గ‌ర్‌, తార్నాక‌, ఉప్ప‌ల్‌, సికింద్రాబాద్‌, బోయిన్ ప‌ల్లి, తిరుమ‌ల‌గిరి, మారేడ్ ప‌ల్లి, బేగంపేట‌, సోమాజిగూడ‌, అబిడ్స్, ఖైర‌తాబాద్, అమీర్ పేట్‌, పంజాగుట్ట‌, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, కూక‌ట్ ప‌ల్లి, మియాపూర్‌ల‌లో వ‌ర్షం కురుస్తోంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Read More:

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ హెచ్చ‌రిక‌

ప‌నికి రావ‌డం లేద‌ని 12 ఏళ్ల బాలుడిని చావ‌గొట్టిన య‌జ‌మాని

క‌రోనా నుంచి కోలుకున్న డైరెక్ట‌ర్‌ రాజ‌మౌళి కుటుంబం