గుడ్ న్యూస్…భారీగా త‌గ్గిన వెండి, బంగారం ధ‌ర‌లు

|

Aug 12, 2020 | 11:54 AM

ఇటీవ‌ల భారీ స్థాయిలో ఎగ‌సిబ‌డిన వెండి, బంగారం ధ‌ర‌లు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి.

గుడ్ న్యూస్...భారీగా త‌గ్గిన వెండి, బంగారం ధ‌ర‌లు
Follow us on

-భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-రూ.1,317 తగ్గిన ప‌సిడి ధర
– వెండి ధర ఏకంగా రూ. 2,900కు త‌గ్గుద‌ల‌
రూపాయి విలువ‌ బలపడటమే కారణమంటున్న బులియన్ నిపుణులు

Gold Rate Today : ఇటీవ‌ల భారీ స్థాయిలో ఎగ‌సిబ‌డిన వెండి, బంగారం ధ‌ర‌లు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప‌ది గ్రాములు ప‌సిడి ధ‌ర రూ. 1,317 తగ్గి రూ. 54763 కు చేరుకుంది. బంగారంతో పాటే వెండి ధ‌ర కూడా భారీగా త‌గ్గింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2943 తగ్గి, ప్ర‌స్తుతం రూ. 73600 కు ప‌త‌న‌మైంది.

ఇదే క్ర‌మంలో ముంబైలో స్వచ్ఛమైన గోల్డ్ ధర రూ. 1564 తగ్గి, రూ. 53951కి చేరింది. కిలో వెండి ధర రూ. 2397 తగ్గి రూ. 71211 కు త‌గ్గింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ‌ మార్కెట్ పైనా పడిందనేది బులియన్ విశ్లేషకుల అభిప్రాయ‌ప‌డుతున్నారు. అదే క్ర‌మంలో రూపాయి మారకపు విలువ బలపడటం కూడా ప‌సిడి ధరల తగ్గుదలకు కార‌ణ‌మ‌ని చెబ‌తున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో బుధ‌వారం బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 క్షీణించిగా.. ప్ర‌స్తుత ధ‌ర రూ.58,300
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.440 క్షీణించ‌గా..ప్ర‌స్తుత ధ‌ర‌ రూ.53,140

 

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”