Today Glod Prcie Down: లాక్‌డౌన్ సమయంలో విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చాయి. తాజాగా బంగారం ధరలు మరోసారి తగ్గాయి. ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.400 వరకు తగ్గడం విశేషం. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశ రాజధానిలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
దేశ రాజధాని న్యూఢిల్లీ విషయానికొస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 410 తగ్గి.. రూ.4850 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. 10 గ్రాముల గోల్డ్ రూ.440 తగ్గి.. రూ. 52,420గా ఉంది.
ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 440 తగ్గి.. రూ. 45,900 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. 10 గ్రాముల గోల్డ్ రూ. 440 తగ్గి.. రూ. 50,070గా ఉంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 410 తగ్గి.. రూ. 45,900 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. 10 గ్రాముల గోల్డ్ రూ. 440 తగ్గి.. రూ. 50,070గా ఉంది.
Also Read: Silver Rates Today: దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన వెండి ధరలు… ఎక్కడ ఎంత పెరిగిందంటే..