ఏపీ ప్రజలకు అలెర్ట్.. పలు జిల్లాలకు పిడుగు హెచ్చరిక..

|

Oct 03, 2020 | 7:18 PM

ఏపీ ప్రజలను విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. పలు జిల్లాలకు పిడుగు హెచ్చరిక..
Follow us on

Thunder Storm Warning In AP: ఏపీ ప్రజలను విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని పి. గన్నవరం, అడ్డతీగల, అంబాజీపేట, అమలాపురం, అయినవల్లి, కపిలేశ్వరపురం, కొత్తపేట మండలాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని కుకునూర్, కడప జిల్లాలో ముద్దునూర్‌లలో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉన్నట్లు వెల్లడించింది. అటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చిరించింది. ప్రజలంతా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్  కె.కన్నబాబు సూచించారు.

Also Read:

గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండగ సీజన్‌లో 200 స్పెషల్ ట్రైన్స్.!