లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కసారిగా.. గంట పాటు ఏడ్చారట. మళ్లీ ఆమె లవ్ ఫెయిల్ అయ్యిందని.. అందుకే బాధపడిందని అనుకోకండి. దానికి మరో కారణం ఉందిలే. అది ఓ పాప గురించి. అదేంటి తనకి పాప ఎక్కడిది అనుకుంటున్నారా? తన అన్న కూతురు అంటే నయన్‌కి మేనకోడలి కోసమట. నిజానికి తన మేనకోడలు వచ్చినప్పటి నుంచే.. సినిమాల్లో ఆమెకు బాగా కలిసివస్తోందట.
గత ఏడాది నుంచి సినిమాల్లో బిజీగా ఉన్నందున నయన్.. తన మేనకోడలు ఏంజెలీనాతో గడపలేకపోతోందట. అందులోనూ మేనకోడలు దుబాయ్‌లో ఉంటోందట. దీంతో పాపను బాగా మిస్ అవుతున్న నయన్.. ఇటీవల బాధను అదుపు చేసుకోలేకపోయిందట. అది గుర్తుతెచ్చుకుని దాదాపు గంటసేపు ఏడుస్తూనే ఉందట. ఈ వార్తలను కొన్ని కోలీవుడ్ వెబ్‌సైట్లు రాశాయి. కాగా.. ఇటీవలే నయనతార, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘దర్బార్’ సినిమాలో నటించారు. జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది.