105 ఏళ్ల యోధురాలు ముందు కరోనా తోకముడిచింది

ఆమె సంకల్పబలం కరోనా మహమ్మారిని ఓడించింది.. దెబ్బకు పారిపోయింది.. కరోనా వైరస్‌ సోకిందని తెలియగానే గజగజమని వణికిపోతున్నవారు ఆమె మనోధైర్యాన్ని చూసి పాఠాలు నేర్చుకోవాలి.. అంత గొప్పేమిటంటారా? ఆమె వయసు 105 ఏళ్లు..

105 ఏళ్ల యోధురాలు ముందు కరోనా  తోకముడిచింది
Follow us

|

Updated on: Aug 06, 2020 | 1:10 PM

ఆమె సంకల్పబలం కరోనా మహమ్మారిని ఓడించింది.. దెబ్బకు పారిపోయింది.. కరోనా వైరస్‌ సోకిందని తెలియగానే గజగజమని వణికిపోతున్నవారు ఆమె మనోధైర్యాన్ని చూసి పాఠాలు నేర్చుకోవాలి.. అంత గొప్పేమిటంటారా? ఆమె వయసు 105 ఏళ్లు.. కర్నూలు పాతబస్తీలోని పెద్దపడఖానా వీధికి చెందిన బి.మోహనమ్మే ఈ కథకు నాయకురాలు.. ఆమె భర్త 30 ఏళ్ల కిందటే కన్నుమూశారు. వీరికి ముగ్గరు కుమారులు.. అయిదుగురు కూతుళ్లు.. ఓ కుమారుడు ఈ మధ్యనే చనిపోయారు.. ఇంకొకరు ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేసి రిటైరయ్యారు.. మరొకరు బీఎస్‌ఎన్‌ఎల్‌లో పని చేసి వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు.. ప్రస్తుతం ఆయన దగ్గరే మోహనమ్మ ఉంటున్నారు.. ఇంత వయసులోనూ మోహనమ్మ ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటారు.. ప్రతి రోజూ యోగా, ధ్యానం, వాకింగ్‌ వంటికి చేస్తారు.. కూతుళ్ల ఊళ్లకు ఒక్కరే వెళ్లి వస్తుంటారు.. కర్నూలు నగరంలో కరోనా కేసులు ఎక్కువమవుతుండటంతో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి 60 ఏళ్ల దాటిని వారందరికీ పరీక్షలు చేస్తున్నారు.. ఇందులో భాగంగానే మోహనమ్మకు కూడా టెస్ట్‌లు చేశారు.. పాజిటివ్‌ వచ్చింది.. వెంటనే ఆమె కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు.. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినప్పుడు కొద్దిగా జ్వరం ఉండింది అంతే..! ఆసుపత్రిలో చేరిన తర్వాత కొద్దిగా ఆయాసం వచ్చిందంతే.. అంతకు మించి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు… ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది చలవతో ఆమె చక్కగా కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతురాలై పోయిన నెల 31న ఇంటికి వచ్చేశారు.. అన్నట్టు ఆమెకు బీపీ, షుగర్‌ కూడా ఉన్నాయి.. అయినా అవేమీ మోహనమ్మను ఏమీ చేయలేకపోయాయి.. కారణం ఆమె మనో ధైర్యమే! అంచేత కరోనా వచ్చిందని హైరానా పడకుండా గుండెనిండా ధైర్యాన్ని నింపుకుని వైద్యుల సలహాలు పాటిస్తే చాలు.. కరోనా గిరోనాలు మన జోలికి కూడా రావని మోహనమ్మ ఉదంతం చెబుతున్న సత్యం!