ఆగస్టు 5న అపెక్స్‌ కౌన్సిల్ కీల‌క మీటింగ్

| Edited By: Pardhasaradhi Peri

Jul 29, 2020 | 2:06 PM

గత కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య రగులుతున్న జల వివాదాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

ఆగస్టు 5న అపెక్స్‌ కౌన్సిల్ కీల‌క మీటింగ్
Follow us on

Apex Council meeting on Aug 5th : గత కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య రగులుతున్న జల వివాదాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కృష్ణా, గోదావరి జల వివాదాలపై ఆగస్టు ఐదో తేదీన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరపాలని కేంద్రం డిసైడ‌య్యింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి అధికారులు.. కృష్ణా, గోదావరి బోర్డులకు సమాచారం ఇచ్చారు.

కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షకావత్ ఛైర్మన్‌గా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు సభ్యులుగా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించ‌నున్నారు. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ స‌మావేశం జ‌రుగ‌నుంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, కృష్ణా న‌దిపై ఏపీ నిర్మించబోతున్న కొత్త ప్రాజెక్ట్, గోదావరిపై తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులు, రెండు రాష్ట్రాల అభ్యంతరాలపై అపెక్స్ కమిటీలో చర్చ జరిగే అవ‌కాశం ఉంది. కాగా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఇప్పటివరకు ఒకసారి మాత్రమే జరిగింది.

Read More : తొమ్మిదో భ‌ర్త చేతిలో భార్య హ‌తం..విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు

Read More : ఆస్తి పన్ను బకాయిదారులకు తెలంగాణ స‌ర్కార్ బంపర్ ఆఫర్..