తెలంగాణ స్పీకర్ కీలక ఆదేశాలు.. సభా ప్రాంగణంలోనే…!

|

Oct 11, 2020 | 6:34 PM

అక్టోబర్ 13, 14 తేదీల్లో ఒకరోజు పాటు సమావేశం కాబోతున్న తెలంగాణ శాసన సభ, మండలిలకు హాజరయ్యే సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధుల విషయంలో సభాధ్యక్షులిద్దరు కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ స్పీకర్ కీలక ఆదేశాలు.. సభా ప్రాంగణంలోనే...!
Follow us on

Telangana speaker crucial orders: అక్టోబర్ 13, 14 తేదీల్లో ఒకరోజు పాటు సమావేశం కాబోతున్న తెలంగాణ శాసన సభ, మండలిలకు హాజరయ్యే సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధుల విషయంలో సభాధ్యక్షులిద్దరు కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో గత సమావేశాలను అర్ధంతరంగా ముగించిన నేపథ్యంలో తాజా సమావేశాలలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.

శాసనసభ, పరిషత్తు సమావేశాల నేపథ్యంలో సభా ప్రాంగణాలలో కోవిడ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా శాసనసభా కార్యదర్శిని కోరారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పరిషత్తు ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. స్పీకర్, ఛైర్మన్ల ఆదేశాల మేరకు సభా ప్రాంగణంలో అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి కోవిడ్ పరీక్షా కేంద్రాలు ప్రారంభం కాబోతున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు.

ఉభయ సభల సభ్యులతోపాటు వారి వ్యక్తిగత సిబ్బంది, అధికారులు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అసెంబ్లీ కార్యదర్శి సూచించారు. కరోనా లక్షణాలున్న వారు విధిగా పరీక్షలు చేయించుకోవాలని, సభకు హాజరయ్యేవారు విధిగా మాస్కులు ధరించాలని ఆయన కోరారు.

Also read: బీహార్ ఎన్నికలపై సోనియా కీలక నిర్ణయం

Also read: ఔటర్‌కు మరిన్ని అందాలు.. ఇంటర్ ఛేంజ్‌ దగ్గర సూపర్ సౌలతులు

Also read: పండగలున్నాయని ఆదమరవొద్దు.. కేంద్ర మంత్రి హెచ్చరిక

Also read: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఆలయాల విధ్వంసం

Also read: దుబ్బాక విజయంలో ఆ వర్గాలే కీలకం