ఈ-కామర్స్ బిజినెస్‌లో టాటా గ్రూప్..!

| Edited By: Pardhasaradhi Peri

Aug 27, 2020 | 6:21 PM

పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ పూర్తి స్థాయిలో ఈ కామర్స్‌ బిజినెస్‌లోకి ఎంటరవుతోంది. ఇటు అమెజాన్ అటు రిలయన్స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఈ-కామర్స్ బిజినెస్‌లో టాటా గ్రూప్..!
Follow us on

పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ పూర్తి స్థాయిలో ఈ కామర్స్‌ బిజినెస్‌లోకి ఎంటరవుతోంది. ఇటు అమెజాన్ అటు రిలయన్స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆన్‌లైన్‌ సేవలతో వినియోగదారులకు మరింత చేరువ అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే వినియోగ ఉత్పత్తులు, సర్వీసులను ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచేందుకు ఈ కామర్స్‌ యాప్‌ను రూపొందించే పనిలో పడింది. ఇప్పటికే దాదాపుగా యాప్‌ డిజైన్‌కు టాటా గ్రూప్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖర్లో లేదంటే జనవరి నెలలో టాటా ఈ కామర్స్‌ బిజినెస్‌ ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ కామర్స్‌ బిజినెస్‌కు మంచి డిమాండ్‌ పెరిగింది. దీనితో టాటా గ్రూప్ ఈ కామర్స్ వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ కంపెనీలు కార్లు, ఎయిర్‌ కండీషనర్లు, లగ్జరీ హోటల్స్‌, డిపార్టమెంటల్‌ స్టోర్స్‌, సూపర్‌మార్కెట్‌ చెయిన్‌ మొదలైనవన్నీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటన్నింటిని ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచితే వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుందని టాటా గ్రూప్‌ భావిస్తోంది. దీనికోసం ఆల్‌ ఇన్‌ వన్‌ యాప్‌ను తీసుకొస్తోంది.  కాగా, ఈ యాప్‌ రూపకల్పనలో టాటా డిజిటల్‌ విభాగం సీఈఓ ప్రతీక్‌ పాల్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. సుమారు ఈ బిజినెస్‌లో వెయ్యి కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే టాటా గ్రూప్‌.. టాటా క్లిక్‌ పేరుతో ఫ్యాషన్‌ షాపింగ్‌ యాప్‌, స్టార్‌ క్విక్‌ పేరుతో కిరాణా ఈ స్టోర్‌, ఎలక్ట్రానిక్ వస్తువల కోసం క్రోమా ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు టాటా గ్రూప్‌ కంపెనీలకు చెందిన ప్రతీ వస్తువును సూపర్‌ యాప్‌లో అందుబాటులో ఉంచేలా చూస్తున్నారు.

Also Read: 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

గుడ్ న్యూస్.. ఒక్క ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కి..

కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!