శ్రీశైలం జలాశాయానికి మళ్లీ వరద నీరు…

కృష్ణమ్మ పరుగు పరుగున శ్రీశైలం జలాశాయానికి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు వద్ద గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గినప్పటికీ.. ఎగువన కురుస్తున్న వర్షాలతో మళ్లీ వరద

శ్రీశైలం జలాశాయానికి మళ్లీ వరద నీరు...
Follow us

|

Updated on: Aug 26, 2020 | 7:41 PM

కృష్ణమ్మ పరుగు పరుగున శ్రీశైలం జలాశాయానికి వచ్చి చేరుతోంది. గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గినప్పటికీ.. ఎగువన కురుస్తున్న వర్షాలతో మళ్లీ వరద పోటెత్తుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండడంతో ప్రాజెక్టు 8 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఇన్ ఫ్లో 2,19,133 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,54,614 క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు . పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 214.3637 టీఎంసీలున్నాయని తెలిపారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.