Sankranthi Special Trains: సంక్రాంతి పండగకు మరిన్ని ప్రత్యేక రైళ్లు.. పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు

|

Jan 10, 2021 | 5:20 AM

Sankranthi Special Trains: సంక్రాంతి పండగ సమీపిస్తున్నకొద్ది దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పలు మార్గాల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు ...

Sankranthi Special Trains: సంక్రాంతి పండగకు మరిన్ని ప్రత్యేక రైళ్లు.. పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు
Follow us on

Sankranthi Special Trains: సంక్రాంతి పండగ సమీపిస్తున్నకొద్ది దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పలు మార్గాల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్‌-బెర్హంపూర్‌కు ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు క్లోన్‌ రైళ్లు నడుస్తాయి.

అలాగే హైదరాబాద్‌ – విశాఖ 9 నుంచి 16వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో ఇదే రైలు విశాఖ నుంచి సికింద్రాబాద్‌ 10 నుంచి 17వ తేదీ వరకు రాకపోకలు కొనసాగిస్తాయని తెలిపారు. సికింద్రాబా్‌ నుంచి తిరుపతి ఈనెల 12న ప్రత్యేక రైలు ఉంటుంది.

రైల్వే మరమ్మతు పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేయడంతో పాటు కొన్ని రైళ్లను సైతం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ-హుబ్లీ, హుబ్లీ-విజయవాడ, హుబ్లీ-హైదరాబాద్‌, హైదరాబాద్‌-హుబ్లీ మధ్య ప్రతి రోజు నడిచే రైళ్లను 20నుంచి 29 తేదీల మధ్య రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నాలుగు రైళ్లను మళ్లించినట్లు చెప్పారు. కేఎన్‌ఆర్‌ బెంగళూరు సిటీ-అజ్మీర్‌, అజ్మీర్‌-కేఎన్‌ఆర్‌ బెంగళూరు, జోధ్‌పూర్‌-కేఎన్‌ఆర్‌ బెంగళూరు సిటీ-జోధ్‌పూర్‌ మధ్య నడిచే రైళ్లను కూసుగలి బైపాస్‌, నావలూర్‌ స్టేషన్ల మీదుగా నడపుతామని అధికారులు పేర్కొన్నారు.

live birds banned in Delhi: బ‌ర్డ్ ఫ్లూ నేప‌థ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. ఢిల్లీలో కోళ్లు, ఇత‌ర ప‌క్షుల దిగుమ‌తిపై నిషేధం..