live birds banned in Delhi: బ‌ర్డ్ ఫ్లూ నేప‌థ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. ఢిల్లీలో కోళ్లు, ఇత‌ర ప‌క్షుల దిగుమ‌తిపై నిషేధం..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కోళ్లు, ఇత‌ర ప‌క్షుల దిగుమ‌తిపై సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం నిషేధం విధించింది.

live birds banned in Delhi: బ‌ర్డ్ ఫ్లూ నేప‌థ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. ఢిల్లీలో కోళ్లు, ఇత‌ర ప‌క్షుల దిగుమ‌తిపై నిషేధం..
Follow us

|

Updated on: Jan 09, 2021 | 5:54 PM

live birds banned in Delhi: దేశంలో బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ విస్తర‌ణ నేప‌థ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కోళ్లు, ఇత‌ర ప‌క్షుల దిగుమ‌తిపై నిషేధం విధించింది. ఇటీవ‌ల దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఇదే క్రమంలో వందలాది పక్షులు మ‌ృత్యువాత పడ్డాయి. ఢిల్లీలోనూ వ‌రుస‌గా ప‌క్షులు మృత్యువాత ప‌డుతుండ‌టంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విష‌యాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. అదేవిధంగా ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను మ‌రో 10 రోజుల‌పాటు మూసి వేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. అలాగే, చ‌నిపోయిన కోళ్ల నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించి జ‌లంధర్‌లోని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించామ‌ని, సోమ‌వారం రిపోర్టులు అందుతాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఆ రిపోర్టుల ఆధారంగా ప్రభుత్వం ఢిల్లీలో త‌దుప‌రి చ‌ర్యలు చేప‌డుతుంద‌ని ఆయన పేర్కొన్నారు.