Transactions without an OTP : త్వరలో ఓటీపీలు లేకుండానే ఆర్థిక లావాదేవీలు..అందుబాటులోకి స్పెషల్ సాఫ్ట్‌వేర్ !

|

Dec 27, 2020 | 8:55 PM

ఇప్పుడు టెక్నాలజీ ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాలా..? నిత్యం జీవితంలో ఈ విషయాన్ని అందరూ గ్రహిస్తూనే ఉన్నాం.

Transactions without an OTP : త్వరలో ఓటీపీలు లేకుండానే ఆర్థిక లావాదేవీలు..అందుబాటులోకి స్పెషల్ సాఫ్ట్‌వేర్  !
Follow us on

ఇప్పుడు టెక్నాలజీ ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాలా..? నిత్యం జీవితంలో ఈ విషయాన్ని అందరూ గ్రహిస్తూనే ఉన్నాం. డిజిటల్ లావాదేవీలు లేని సమయంలో డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం జరిగేది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో అన్నీ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఏ లావాదేవీ అయినా సెకన్స్‌లో అయిపోతుంది. డబ్బులు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా…ఏదైనా కొనాలన్నా..సినిమా, బస్, రైలు టికెట్లు బుక్ చేసుకోవాలన్నా…నిమిషాల పని అంతే. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాకింగ్‌ను వినియోగం ఇప్పుడు ఎక్కువగా ఉంది. అయినా మనీ విషయం కాబట్టి బ్యాంక్‌లు ఓటీపీలను ఇప్పటివరకు ప్రిఫర్ చేస్తూ వచ్చాయి. అయితే ఇకపై ఓటీపీల అవసరం లేకుండా ఆర్థిక లావాదేవీలు జరిపే సౌలభ్యం రానుంది.

ప్రజంట్ మనం ట్రాన్సాక్ష‌న్ కంప్లీట్ చెయ్యాలంటే..వారు నిర్దేశించిన సమయంలో ఓటీపీని ఎంటర్ చెయ్యాలి. ఈ క్రమంలో సిగ్నల్ ప్రాబ్లమ్ లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే..ఓటీపీ సమయానికి రాక..సదరు లావాదేవీ ఫెయిల్ అవుతుంది. దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. వీటిని అధిగ‌మించేందుకు త్వ‌ర‌లో ఓటీపీ లేకుండానే డబ్బు లావాదేవీలు జ‌రిగేలా నూత‌న టెక్నాల‌జీని అందుబాటులోకి తేనున్నారు.

అయితే ఓటీపీ లేకుండా ఎలా వెరిఫై చేస్తారు ? అని ప్రధాన డౌట్. ఇందుకు గాను ఓ స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేస్తున్నారు. టెలికాం సంస్థ‌లు జియో,  వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు ఆ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించుకోనున్నాయి. ఈ క్ర‌మంలో వినియోగ‌దారుడికి చెందిన లావాదేవీలకు వారు త‌మ ఫోన్ నంబ‌ర్ల‌ను వెరిఫై చేస్తే సరిపోతుంది. ఈ క్ర‌మంలో ట్రాన్సాక్ష‌న్లు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్త‌వుతాయి. అయితే ప్ర‌స్తుతానికి ఈ త‌ర‌హా సాంకేతిక ప‌రిజ్ఞానం ఇంకా అభివృద్ధి  ద‌శ‌లోనే ఉంది. కానీ వ‌చ్చే ఏడాది జూన్ వ‌ర‌కు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read :

Rajinikanth Health Update : ఆల్ క్లియర్.. ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..ఆనందంలో అభిమానులు

 మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం