రైతు కుటుంబానికి ట్రాక్ట‌ర్ పంపిన సోనూ..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఫోన్

|

Jul 26, 2020 | 10:38 PM

న‌టుడు సోనూసూద్ మాట నిల‌బెట్టుకున్నాడు. పొద్దున్న‌ ఓ రైతు కుటుంబానికి ట్రాక్ట‌ర్ కొనిస్తాన‌ని మాట ఇచ్చిన సోనూ..సాయంత్రంలోపు పంపించి రియ‌ల్ హీరో అనిపించుకున్నడు.

రైతు కుటుంబానికి ట్రాక్ట‌ర్ పంపిన సోనూ..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఫోన్
Follow us on

Sonu Sood :న‌టుడు సోనూసూద్ మాట నిల‌బెట్టుకున్నాడు. పొద్దున్న‌ ఓ రైతు కుటుంబానికి ట్రాక్ట‌ర్ కొనిస్తాన‌ని మాట ఇచ్చిన సోనూ..సాయంత్రంలోపు పంపించి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు. వివ‌రాల్లోకి వెళ్తే..చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లికి చెందిన ఓ రైతు ఎడ్లు కొనే స్థోమ‌త లేక త‌న ఇద్ద‌రు కూతుర్ల‌నే జోడెడ్లుగా మార్చి భూమి దున్నుతున్నాడు. ఓ వ్య‌క్తి ఆ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌గా అది కాస్తా వైర‌లయ్యింది. ఈ క్ర‌మంలో ఆ వీడియో సోనూ సూద్ కంట‌ప‌డింది. చ‌లించ‌పోయిన‌..సోనూ వారి కుటుంబానికి జ‌త ఎడ్లు కొనిస్తాన‌ని మాట ఇచ్చాడు. ఈ త‌ర్వాత వారికి కావాల్సింది ఎడ్లు కాదు..ట్రాక్ట‌ర్ అని సాయంత్రం క‌ల్లా అది వారి ఇంటి ఉంటుంద‌ని మాటిచ్చి..అన్న‌ట్లుగానే పంపించాడు. దీంతో సోష‌ల్ మీడియాలో అత‌డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. ఈ క్ర‌మంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు సోనూసూద్ కు ఫోన్ చేసి అభినందించారు. అత‌డిని చూసి ప‌లువురు స్పూర్తి పొందాల‌ని సూచించారు. ఆ ఆడ‌బిడ్డ‌ల‌కు టీడీపీ అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు.

Read This :  వివేకా హ‌త్య కేసులో కీల‌క అప్ డేట్..