Sonu Sood: ఆ 400 కుటుంబాల బాధ్యత నాదేః సోనూసూద్

|

Jul 13, 2020 | 6:01 PM

సోనూసూద్.. తాజాగా మరో మంచి పని చేసేందుకు సిద్దమయ్యారు. లాక్‌డౌన్ సమయంలో ప్రమాదంలో మరణించిన, గాయపడిన వలస కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందడుగు వేస్తున్నారు.

Sonu Sood: ఆ 400 కుటుంబాల బాధ్యత నాదేః సోనూసూద్
Follow us on

Sonu Sood To Help 400 Families: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సోనూసూద్ ఎంతోమంది వలస కార్మికులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, ఫ్లైట్లలో వారి స్వస్థలాలకు చేర్చడమే కాకుండా కరోనా వారియర్స్ కు హోటల్ సైతం కేటాయించారు. స్వలాభం ఆశించకుండా సొంత ఖర్చులతో లాక్‌డౌన్ సమయంలో వీరందరికీ ఆయన చేసిన సేవకు అభిమానులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.

అయితే అంతటితో ఆగని సోనూసూద్.. తాజాగా మరో మంచి పని చేసేందుకు సిద్దమయ్యారు. లాక్‌డౌన్ సమయంలో ప్రమాదంలో మరణించిన, గాయపడిన వలస కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందడుగు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించిన ఆయన.. సుమారు 400 కుటుంబాల వివరాలను తీసుకున్నారు. వారందరికీ కూడా సాయం చేసేందుకు సిద్ధమయ్యారు.

Also Read:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం.!

ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!

ఏపీలోని ఆ రెండు ప్రాంతాల్లో మళ్లీ కఠిన లాక్‌డౌన్…