క‌రోనా సోకింద‌ని అమ్మ‌ను పొలం వ‌ద్ద వ‌దిలేశారు

|

Sep 06, 2020 | 2:17 PM

కరోనాకే కాదు కాఠిన్యానికి కూడా అర్జెంట్‌గా మెడిసిన్ కావాలి. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ వ‌చ్చి ప్ర‌జ‌ల జీవ‌న వ్య‌వ‌స్థ‌పై దాడి చేసింది.

క‌రోనా సోకింద‌ని అమ్మ‌ను పొలం వ‌ద్ద వ‌దిలేశారు
Follow us on

కరోనాకే కాదు కాఠిన్యానికి కూడా అర్జెంట్‌గా మెడిసిన్ కావాలి. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ వ‌చ్చి ప్ర‌జ‌ల జీవ‌న వ్య‌వ‌స్థ‌పై దాడి చేసింది. మ‌నుషుల్లో మాన‌వ‌త్వ‌లేమిని ప్ర‌పంచానికి తెలియ‌జేసింది. ఈ క‌రోనా కార‌ణంగా మ‌న‌సు విలవిల్లాడే ఘ‌ట‌న‌లు నిత్యం అనేకం చూస్తున్నాం. తాజాగా మ‌రో ఘ‌ట‌న స‌మాజంలోని కాఠిన్యం స్థాయిని తెలియ‌జెప్పింది.

రక్తమాంసాలు పంచి, న‌వ మాసాలు మోసి జన్మనిచ్చిన మాతృమూర్తిపై క‌రోనా కార‌ణంగా వివ‌క్ష చూపించారు కొడుకులు. తల్లికి కరోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ అవ్వ‌డంతో ఇంట్లో నుంచి తీసుకువెళ్లి పొలం వద్ద వదిలేశారు. ఈ దారుణ ఘ‌ట‌న వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో జ‌రిగింది. గ్రామానికి చెందిన మారబోయిన లచ్చమ్మ (82)కు కరోనా సోకింది. దీంతో తల్లిని ఒంటరిగా పొలంలో వదిలేసారు కన్న కొడుకులు. బాధితురాలికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నా ఇలా పొలంలో వ‌దిలేయ‌డం సిగ్గుప‌డే అంశం.

 

Also Read :

జ‌గ‌న్‌పై దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు

 జ‌గ‌న్ మార్క్ నిర్ణయం : మండలానికి రెండు పీహెచ్‌సీలు