రికార్డు స్థాయిలో పెరిగిన వెండి ధ‌ర‌….

|

Jul 25, 2020 | 7:03 PM

బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో చేసిన ఆభ‌ర‌ణాల‌కు శుభకార్యాల్లో ప్రాముఖ్య‌త ఉంటుంది. ముఖ్యంగా మ‌గువ‌లు ఈ రెండు లోహాలు ఎంతో ప్రీతిపాత్ర‌మైన‌వి.

రికార్డు స్థాయిలో పెరిగిన వెండి ధ‌ర‌....
Follow us on

Today Silver Rate : బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో చేసిన ఆభ‌ర‌ణాల‌కు శుభకార్యాల్లో ప్రాముఖ్య‌త ఉంటుంది. ముఖ్యంగా మ‌గువ‌లకు ఈ రెండు లోహాలు ఎంతో ప్రీతిపాత్ర‌మైన‌వి. అయితే బంగారంతో పోలిస్తే వెండికి విలువ తక్కువ. అయితే మాత్రం.. పేద‌వారి బంగారంగా వెండి విరాజిల్ల‌తుంది. వారి ఇంట్లో ఏ శుభ‌కార్యం జ‌రిగినా వెండి ఆభ‌ర‌ణాలే ఎక్కువ ద‌ర్శ‌న‌మిస్తాయి. అయితే అందరికీ అందుబాటులో ఉండే వెండి ధర.. గత నాలుగైదు రోజుల్లోనే భారీగా పెరిగింది.

గ‌డిచిన వారం రోజుల్లో కిలో వెండి ధ‌ర 17.5శాతం అంటే రూ.9000 పెరిగింది. ఈ ఏడాది మార్చితో పోల్చితే ప్రస్తుత రేట్లు 70 శాతం ఎక్కువ. మార్కెట్‌లో గురువారం నాడు కిలో వెండి ధర రూ. 62,400గా ఉంది. ఇది గ‌డిచిన‌ 9 సంవత్సరాలలో ఆల్ టైమ్ రికార్డ‌ని వ్యాపారులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయంగానూ ఔన్స్ వెండి ధర 22.డాలర్లకు పెరిగింది.

ప‌రిశ్ర‌మ‌ల్లో వాడ‌కం పెర‌గ‌డం, నాణేలా త‌యారీ వ‌ల్ల ధ‌ర‌లు పెర‌గిన‌ట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇక‌ కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న సంక్షోభ‌ పరిస్థితులు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలు కూడా వెండి ధ‌ర‌ను ప్రభావితం చేశాయి.

 

ఇది కూడా చ‌ద‌వండి: విశాఖ‌ : పెళ్లికి అతిథులు రాలేదు..కానీ మూడు పూటలా విందు భోజ‌నాలు