Sensex: కరోనా కాలంలోనూ పెరిగిన పెట్టుబడిదారుల సంపదన… ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?

| Edited By:

Jan 01, 2021 | 5:28 AM

ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది 2020. కరోనా మహమ్మారి వచ్చి దేశాలన్నింటి ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది.

Sensex: కరోనా కాలంలోనూ పెరిగిన పెట్టుబడిదారుల సంపదన... ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?
Follow us on

ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది 2020. కరోనా మహమ్మారి వచ్చి దేశాలన్నింటి ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. అయితే చారిత్రక మలుపునకు సాక్షిగా నిలిచిన ఈ సంవత్సరాన్ని పెట్టుబడిదారులు (సెన్సెక్స్ 2020) బాగా గుర్తుంచుకుంటారు. కరోనా వ్యాధి కారణంగా, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైంది. అయినప్పటికీ విచిత్రంగా ఈ సంవత్సరం పెట్టుబడిదారుల సంపద 32.50 లక్షల కోట్లు పెరిగింది. ఈ ఏడాది సెన్సెక్స్ 15.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి 24 న స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు, సెన్సెక్స్ 25638 కనిష్ట స్థాయికి చేరుకుంది.

 

సంవత్సరం చివరిలో, డిసెంబర్ 31 న, ఇది ఆల్ టైం స్థాయి 47896 కి చేరుకుంది. అలాగే 47751 స్థాయిలో ముగిసింది. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ ఏడాది 1 కోటి 88 లక్షల 3 వేల 518 కోట్లకు చేరుకుంది. మార్చి 23న ప్రపంచ స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పకూలింది. ఆ తరువాత మార్కెట్ మళ్లీ ఊపందుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం చివరినాటికి, యుఎస్ ఇండెక్స్ నాస్డాక్లో 86 శాతం, సెన్సెక్స్లో 80 శాతం, ఎస్ అండ్ పి 500 లో 66 శాతం, డౌ జోన్స్లో 63 శాతం, నిక్కీలో 38 శాతం, ఎఫ్‌టిఎస్‌ఇ 20 శాతం, హాంకాంగ్ స్టాక్ మార్కెట్ 18 శాతం చొప్పున మార్చి 23 క్రాష్ తర్వాత కోలుకున్నాయి.

 

Also Read:

Vodafone Idea Offer: వోడాఫోన్ ఐడియా ఆఫర్ అదుర్స్… వన్ ఇయర్ ప్లాన్‌తో పాటు ఎక్స్‌ట్రా డాటా…