నాటుసారా తయారు చేస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్

|

Sep 12, 2020 | 5:09 PM

టెక్నాలజీ పెరుగుతోంది. మంచి విషయమే. కానీ అది మంచికి ఎంత ఉపయోగపడుతుంది అన్నది చర్చించాల్సిన అవసరం ఉంది. 

నాటుసారా తయారు చేస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్
illicit liquor
Follow us on

టెక్నాలజీ పెరుగుతోంది. మంచి విషయమే. కానీ అది మంచికి ఎంత ఉపయోగపడుతుంది అన్నది చర్చించాల్సిన అవసరం ఉంది.  టెక్నాలజీ తప్పుడు పనులకు ఉపయోగిస్తూ యువత పెడదారి పడుతుంది. తాజాగా యూట్యూబ్ లో చూసి నాటుసారా తయారు చేస్తోన్న ఓ బీటెక్ స్టూడెంట్ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు చిక్కాడు.

వివరాల్లోకి వెళ్తే..తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటి సమీపంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు తోటపల్లికి చెందిన మఠవలం వంశీకృష్ణా రెడ్డి అనే యువకుడు. అక్కడే ఉంటూ యూట్యూబ్ లో చూసి నాటుసారా తయారుచేయడం ప్రారంభించాడు. పక్కా సమాాచారంతో అతని ఇంటిలో సోదాలు నిర్వహించారు ఎస్.ఈ.బీ అధికారులు. లోపల సీన్ చూసి షాక్ కు గురయ్యారు. ఇంట్లో 70 లీటర్ల నాటు సారా, 400 లీటర్ల నాటు సారా తయారీకి సంబంధించిన బెల్లం ఊటతో పాటు, కర్ణాటక మద్యం ఖాళీ సీసాలు లభ్యమయ్యాయి. నాటుసారా తయారుచేస్తున్నట్లు వంశీకృష్ణా రెడ్డి అంగీకరించాడు. అతని వద్ద నుంచి ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి..విచారిస్తున్నారు.

Also Read :

“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !

పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం