బలవంతపు మత మార్పిడుల వ్యతిరేక చట్టాలపై యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ‘సుప్రీం’ నోటీసులు చట్టబధ్ధతపై త్వరలో తీర్పు.

| Edited By: Pardhasaradhi Peri

Jan 06, 2021 | 2:31 PM

యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అమలు చేస్తున్న బలవంతపు మత మార్పిడుల వ్యతిరేక చట్టాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది.

బలవంతపు మత మార్పిడుల వ్యతిరేక చట్టాలపై యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు చట్టబధ్ధతపై త్వరలో తీర్పు.
Follow us on

యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అమలు చేస్తున్న బలవంతపు మత మార్పిడుల వ్యతిరేక చట్టాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ రాష్ట్రాలకు కోర్టు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లోగా-తదుపరి విచారణ జరిగే లోగా ఈ నోటీసులకు సమాధానాలివ్వాలని ఆదేశించింది. యూపీలో ‘ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లా ఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజన్ ఆర్డినెన్స్-2020’ పేరిట, ఉత్తరాఖండ్ లో ‘ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ యాక్ట్-2018’ పేరిట ప్రభుత్వాలు ఈ చట్టాలను అమలు చేస్తున్నాయి. పెళ్లి పేరిట హిందూ యువతులనుముస్లిం యువకులు వారిని వివాహం చేసుకుని  ఆ తరువాత వారిని ఇస్లాం లోకి మారాలని ఒత్తిడి చేసిన పక్షంలో వారికి  కఠిన శిక్షలు విధించాలని ఇవి నిర్దేశిస్తున్నాయి. లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాల పేరిట వీటిని అమలు చేస్తున్నారని, అయితే ఇవి ముస్లిములను టార్గెట్ చేయడానికేనని పిటిషన్ దారులు పేర్కొన్నారు.

మొదట ఈ పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఈ విధమైన పిటిషన్లు ఇదివరకే అలహాబాద్, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో దాఖలయ్యాయని, అందువల్ల అక్కడికే వెళ్లాలని సీజేఐ ఎస్ఎ .బాబ్డే సూచించారు. అయితే మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఈ విధమైన చట్టాలను తెచ్చే యోచనలో ఉన్నాయని సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ తరఫు లాయర్ సి.యు.సింగ్ కోర్టు దృష్టికి తెచ్చ్చారు.
Read also :లవ్ జిహాద్‌ వ్యవహరంపై యూపీ సర్కార్ సీరియస్.. మరో కేసు నమోదు.. ఇద్దరి అరెస్ట్.
Read Also :మత మార్పిడుల వ్యతిరేక చట్టం కింద ఆరుగురి అరెస్ట్, మరో ఐదుగురిపై రూ. 25 వేల రివార్డ్ ! యూపీలోనే ఎందుకిలా ?