చీరమేను సీజన్ వచ్చేసిందోచ్..!

| Edited By: Ram Naramaneni

Oct 16, 2020 | 2:19 PM

ఫేమస్ వంటకాలు అనగానే ముందుగా గోదావరి జిల్లాలు గుర్తుకువస్తాయి.  ఇక అక్కడ దొరికే చేపలు, రొయ్యలు గురించి తలచుకుంటే చాలు నోట్లో నోరూరాల్సిందే.

చీరమేను సీజన్ వచ్చేసిందోచ్..!
Follow us on

ఫేమస్ వంటకాలు అనగానే ముందుగా గోదావరి జిల్లాలు గుర్తుకువస్తాయి.  ఇక అక్కడ దొరికే చేపలు, రొయ్యలు గురించి తలచుకుంటే చాలు నోట్లో నోరూరాల్సిందే. ఇక పుస్తెలు తాకట్టు పెట్టెనా పులస తినాలనే నానుడి ఉంది. అదిరిపోయే రేటు పలికే పులస కూడా గోదావరి జిల్లాలోనే లభ్యమవుతుంది. ఇక ఆ పక్కనే వున్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇప్పుడు చీరమేను సందడి చేస్తోంది. గోదావరిలో లభించే అరుదైన మత్య్స సంపదలో చీరమేను ఒకటి. ఈ సారి కాస్త ముందుగా అక్టోబరు రెండో వారంలోనే ఈ సీజనల్ చేప కనిపించింది. చూడ్డానికి చిన్నగా కనిపించినప్పటికీ దీని రుచి అద్భుతం అంతే. గ్లాసు, తవ్వ, సేరు, క్యారేజీ, బిందెలు, బకెట్లలో కొలిచి చీరమేను చేపల్ని అమ్ముతుంటారు. యానాంలో సేరు చీరమేను రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పలికింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారు చీరమేను పులుసు, ఇగురు పెట్టుకుని తింటారు. పలుచటి చీరతో సేకరించడం వల్ల వీటికి  చీరమేను చేపలనే పేరు వచ్చింది.  సుమారు మూడు నెలల పాటు ఇవి దొరుకుతాయని మత్య్సకారులు చెబుతున్నారు. ( ట్రాక్టర్‌ తిరగబడి కొడుకు మరణం, బాధ తట్టుకోలేక ఆగిన తల్లి గుండె )