Chiranjeevi Lucifer Remake Satyadev: చిరంజీవి మరో కొత్త సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర..!

|

Jan 02, 2021 | 9:34 PM

Chiranjeevi Lucifer Remake Satyadev: మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే ఖైదీ 150, సైరా ...

Chiranjeevi Lucifer Remake Satyadev: చిరంజీవి మరో కొత్త సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర..!
Follow us on

Chiranjeevi Lucifer Remake Satyadev: మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే ఖైదీ 150, సైరా సినిమాలతో మంచి విజయాలను అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉండగా, కరోనాతో వాయిదా పడింది. తర్వాత మళ్లీ షూటింగ్‌ మొదలైంది. ఈ సినిమాల తర్వాత చిరంజీవి మూడు సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిలో మలయాళంలో సూపర్‌ హిట్‌ అందుకున్న లూసిఫర్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నారు. ఈ సినిమాను తెలుగులో రాజా డైరెక్టర్‌ చేయనున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్స్‌ బయటకు వచ్చింది. మలయాళంలో లూసిఫర్‌లో మరో హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు రీమేక్‌లో హీరో సత్యదేవ్‌ ఆ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య సత్య దేవ్ చిరు తో దిగ్గిన ఓ ఫోటో వైరల్ అవుతోంది.

Taapsee In Telugu Movie: తెలుగు సినిమాకు ఓకే చెప్పిన తాప్సీ.. కాజల్‌ స్థానాన్ని భర్తీ చేసిందా..?