చైతూకు విడాకులు ఇవ్వమన్న నెటిజన్‌కు.. సామ్ క్రేజీ కౌంటర్!

|

Nov 05, 2020 | 10:56 PM

వెబ్ సిరీస్‌లు, యాడ్స్, సినిమాలతో వివాహం తర్వాత తన కెరీర్‌ను ఫుల్ బిజీగా కొనసాగిస్తోంది అక్కినేని కోడలు సమంతా. ఇటీవల మామ ప్లేస్‌లో..

చైతూకు విడాకులు ఇవ్వమన్న నెటిజన్‌కు.. సామ్ క్రేజీ కౌంటర్!
Follow us on

Samantha Funny Reply: వెబ్ సిరీస్‌లు, యాడ్స్, సినిమాలతో వివాహం తర్వాత తన కెరీర్‌ను ఫుల్ బిజీగా కొనసాగిస్తోంది అక్కినేని కోడలు సమంతా. ఇటీవల మామ ప్లేస్‌లో బిగ్ బాస్-4కు హోస్టుగా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా కెరీర్‌ పరంగా ఎంతో బిజీగా ఉండే సమంతా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులు అప్డేట్స్ ఇస్తుంటుంది.

తాజాగా ‘ఫీల్ గుడ్’ అంటూ సమంతా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ.. ”చైకి డివోర్స్ ఇచ్చేయ్.. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం’ అని కామెంట్ చేశారు. ఈ కామెంట్‌కు సమంతా.. ”కష్టం.. ఒకపని చెయ్.. చైని అడుగు” అని రిప్లై ఇచ్చింది. దీనితో నెటిజన్లు ‘సామ్ భలే ఫన్నీగా సమాధానం ఇచ్చిందంటూ కామెంట్స్ చేశారు.

Also Read: ఏపీ: 829 మంది టీచర్లకు.. 575 మంది విద్యార్ధులకు కరోనా.!