RTI Report: రైళ్లలో రేప్‌లు.. విస్తుపోయే నిజాలు.!

| Edited By:

Mar 03, 2020 | 10:11 PM

RTI Report On Rape Cases: దేశంలో స్త్రీకి రక్షణ లేకుండాపోతోంది. అమ్మాయిలను, మహిళలను వేధించడానికి కామాంధులకు వీలుకాని చోటంటూ ఏదీ లేకుండా పోయింది. మెట్రోలు, రైళ్లలో కూడా మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయన్న వార్తలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే 2017-19 మధ్య భారతీయ రైళ్లలో మగువలపై జరిగిన అఘాయిత్యాలపై ఆర్టీఐ ఓ నివేదికను సేకరించింది. ఈ రిపోర్టులో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ నివేదికతో రైళ్లల్లో మహిళలకు భద్రత కరువైందని తెలుస్తోంది. […]

RTI Report: రైళ్లలో రేప్‌లు.. విస్తుపోయే నిజాలు.!
Follow us on

RTI Report On Rape Cases: దేశంలో స్త్రీకి రక్షణ లేకుండాపోతోంది. అమ్మాయిలను, మహిళలను వేధించడానికి కామాంధులకు వీలుకాని చోటంటూ ఏదీ లేకుండా పోయింది. మెట్రోలు, రైళ్లలో కూడా మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయన్న వార్తలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే 2017-19 మధ్య భారతీయ రైళ్లలో మగువలపై జరిగిన అఘాయిత్యాలపై ఆర్టీఐ ఓ నివేదికను సేకరించింది. ఈ రిపోర్టులో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ఆ నివేదికతో రైళ్లల్లో మహిళలకు భద్రత కరువైందని తెలుస్తోంది. కదిలే రైళ్లలో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయని.. అంతేకాకుండా వాటికి సంబంధించిన కేసులు కూడా అధికశాతంలోనే నమోదయ్యాయని ఆర్టీఐ వెల్లడించింది. గత రెండేళ్లలో రైల్వే పరిసరాల్లో, కదులుతున్న రైళ్లలో చోటు చేసుకున్న అత్యాచారాల సంఖ్య 160 కావడం గమనార్హం.

ఇక లైంగిక వేధింపుల కేసులు అయితే ఏకంగా 1672 నమోదయ్యాయని రైల్వే శాఖ సమాచారం. వీటిలో 870 కేసులు కదులుతున్న రైళ్లలో చోటు చేసుకున్నవట. కాగా, దొంగతనాల సంఖ్య విషయానికి వస్తే సుమారు 4718 కేసులు నమోదైనట్లు భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. అటు గడిచిన మూడేళ్లలో 771 కిడ్నాపింగ్ కేసులు, 4,718 దొంగతనాలు, 213 అటెంప్ట్ మర్డర్, 542 మర్డర్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా రైల్వే పరిసరాల్లో, కదులుతున్న ట్రైన్లలోనూ చోటు చేసుకున్నావని నివేదికలో వెల్లడైంది.

For More News:

హైదరాబాద్‌లో ఇంటి వద్దకే భోజనం.. కేవలం రూ.5 మాత్రమే.!

అందంగా లేనేమో.. అందుకే తప్పించారేమో.. సమీరా కామెంట్!

కోహ్లీ దురుసుతనాన్ని భూతద్ధంలో పెట్టి చూడలేం.. విలియమ్సన్‌

రౌడీగారు.. మరీ ఇంత నాటీనా.?

మహేష్ బాబు వీరాభిమాని మృతి.. కారణమిదేనా.?

టెస్ట్ ఛాంపియన్‌షిప్.. కోహ్లీసేనకు ముందుంది ముసళ్ల పండగ..!

మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా.? అయితే ఇది మీకోసమే.?

మృతి చెందిన టీచర్ ‘సస్పెన్షన్’.. బీహార్ విద్యాశాఖ నిర్వాకం.!